బిజినెస్

ఆహా... ఏమి రుచి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 14: విశాఖ జిల్లా అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. గిరిజన సహకార సంస్థ (జిసిసి) ప్రపంచ దేశాలకు దీని రుచి చూపిస్తోంది. ఇటలీ, దుబాయి దేశాలకు కాఫీ గింజలను ఎగుమతి చేస్తున్నారు. రెండు ప్రధానమైన లక్ష్యాలతో పనిచేస్తున్న జిసిసి... దళారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు గిరిజన రైతులు పండించే కాఫీని నేరుగా కొనుగోలు చేసి కార్పొరేట్ సంస్థలకు అమ్మడం ద్వారా గిట్టుబాటు ధర లభించేలా చేయగలిగింది. అలాగే అంతర్జాతీయ స్థాయిలో ముడి కాఫీ అమ్మకాలను పెంచగలిగింది. ఇలా ఈ ఏడాది 1,400 మెట్రిక్ టన్నుల ముడి కాఫీని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయగలిగింది. ‘లాభం రాదు, నష్టం లేదు’ అనే పద్ధతిలో గిరిజన రైతులు లబ్ధి పొందే విధంగా విశాఖ జిల్లాలో చింతపల్లి, పాడేరు, అరకు, హుకుంపేట, డుంబ్రిగుడ, అనంతగిరి, జి.మాడుగుల, జికె వీధి, ముంచింగిపుట్ ఏజెన్సీ మండలాల్లో దాదాపు లక్ష ఎకరాల్లో కాఫీ పంటను నాలుగు వేలమందికి పైగా గిరిజన రైతులు పండిస్తున్నారు. దీనిని వ్యాపారులు, దళారుల చేతుల్లోకి వెళ్ళనీయకుండా కేవలం మధ్యర్తిత్వం ద్వారా బెంగళూరుకు చెందిన కార్పొరేట్ సంస్థలకు జిసిసి విక్రయిస్తోంది. జిల్లాలో అరకు, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల పరిధిలో దిగుబడి అయ్యే ముడి కాఫీకి ఎక్కువ ధర లభిస్తోంది. ఇక్కడి భూసారం, అధిక దిగుబడి వంటి కారణాలతో చెర్రీ కాఫీ కిలో రూ.74 వరకు పలుకుతుండగా, అదే పార్చిమెంట్ కాఫీ కిలో రూ.157 వరకు ఉంది. అలాగే పాడేరు మండలంలో కిలో చెర్రి కాఫీ రూ.68.38 ఉండగా, పార్చిమెంట్ కాఫీ కిలో రూ. 153.82, జి.మాడుగులలో చెర్రీ కిలో రూ.66, పార్చిమెంట్ కిలో రూ.154 చొప్పున అమ్ముడుపోతోంది. చింతపల్లినుంచి దిగుబడి అయ్యే చెర్రీ కాఫీ కిలో రూ.70.40, పార్చిమెంట్ కాఫీ కిలో రూ.157గా ఉంది. జికె వీధి మండలంలో చెర్రి కాఫీ కిలో రూ.68.58, పార్చిమెంట్ కాఫీ కిలో రూ.155.22గా ధర పలుకుతోంది. అయితే పాడేరు, హుకుంపేట, పెదబయలు, ముంచింగిపుట్ మండలాలకు చెందిన కాఫీ సాధారణ ధరకే అమ్ముడుపోతోంది.
జిల్లాలో 11 ఏజెన్సీ మండలాలకు సంబంధించి దాదాపు లక్ష ఎకరాల్లో కాఫీ పండిస్తున్నారు. ఒక ఎకరాకి కనీసం 70 కిలోల కాఫీ దిగుబడి అవుతుంది. ఈ విధంగా రెండు ఎకరాల్లో 150 కిలోల మేర పంట దిగుబడికిగాను ఒక్కో రైతుకు కనీసం పది వేల నుంచి 12 వేల రూపాయల మేర ఆదాయం వస్తుంది. ఈ విధంగా తొలి ఏడాదిలోనే 4వేల మందికి పైగా రైతులు రూ.11.2 కోట్ల మేర ఆదాయం సమకూర్చుకోగలిగారు.

భారత్‌తో వాణిజ్య బంధం
మరింత బలోపేతం
అఫ్గాన్ రాయబారి సైదా వెల్లడి

హైదరాబాద్, అక్టోబర్ 14: భారత్‌తో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేం దుకు తమ దేశం ఆసక్తిగా ఉందని అఫ్గానిస్తాన్ రాయబారి డాక్టర్ సైదా మహమ్మద్ అబ్దలి వెల్లడించారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై శుక్రవారం ఇక్కడ ఎఫ్ టాఫ్సీ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య మండళ్ల సమాఖ్య) ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అబ్దలి మాట్లాడుతూ, ప్రాచీన కాలం నుంచి ఇరు దేశాల మధ్య ఘనమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయన్నారు. విద్యారంగంలో ఇక్కడి అవకాశాలను తమ దేశ విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారన్నారు. ఇరు దేశాల మధ్య ఘర్షణ లేని వాతావరణం ఉందని, ప్రపంచంలో ఏ ఇతర దేశాలతో తమకు ఇంతటి మంచి సంబంధాలు లేవన్నారు. హైదరాబాద్‌లో త్వరలో ఒక కానె్సల్‌ను ఏర్పాటు చేసే యోచన ఉన్నట్లు ఆయన చెప్పారు. త్వరలో మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆఫ్గనిస్తాన్‌లో ఉన్న సహజసిద్ధమైన ప్రకృతి వనరులను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. సాలీనా తమ దేశం ప్రకృతి వనరుల ద్వారా 3 మిలియన్ డాలర్లను ఆర్జిస్తున్నట్లు చెప్పారు. తమ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన పారిశ్రామివేత్తలను కోరారు. ఇక్కడి పారిశ్రామికవేత్తలకు పెద్ద పీట వేస్తామన్నారు.

ఎయిర్ ఇండియాకు లాభాలు
పదేళ్లలో ఇదే తొలిసారి

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియాకు పదేళ్లలో మొట్టమొదటిసారి లాభాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియాకు 105 కోట్ల నిర్వహణ లాభాలు వచ్చాయి. విమాన ఇంధనం ధరలు భారీగా తగ్గడంతో పాటుగా ప్రయాణికల సంఖ్య పెరగడం ఈ లాభాలు రావడానికి ప్రధాన కారణం. తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, 2014-15 ఆర్థిక సంవత్సర కాలంలో రూ. 2,636 కోట్ల నష్టంతో ఉండిన ఈ సంస్థ ఇప్పుడు లాభాలు ఆర్జించే స్థితికి చేరుకోవడం గమనార్హం. 2007లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను ఎయిర్ ఇండియాలో విలీనం చేసినప్పటినుంచి కూడా ఈ సంస్థకు ఏ ఏడాది కూడా లాభాలు రాలేదు. 2014-15 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణికుల సంఖ్య 6.6 శాతం పెరిగి కోటీ 80 లక్షలకు చేరుకుంది. ఇంధనం ధరలు తగ్గడంతో పాటుగా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో 2015-16 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రాబడి (పన్నులు, వడ్డీలు, ఇతర తరుగులకు ముందు) అంతకు ముందు సంవత్సరంలో ఉండిన రూ. 1436 కోట్లనుంచి రూ.3587 కోట్లకు పెరిగింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఎయిర్ ఇండియా డైరెక్టర్ల బోర్డు గత ఆర్థిక సంవత్సరపు లెక్కలకు ఆమోదం తెలిపింది.