బిజినెస్

ఏకమైన మహీంద్ర రిటైల్, ఫస్‌ట్రకై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: మహీంద్ర రిటైల్ పర్యవేక్షణలోని ఫ్రాంచైజీ వ్యాపారాన్ని బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలోని కిడ్స్‌కేర్ విభాగం ఫస్ట్‌క్రై కొనుగోలు చేస్తోంది. వ్యాపార ఏకీకృత ఒప్పందంలో భాగంగా 362.1 కోట్ల రూపాయలకు మహీంద్ర అండ్ మహీంద్ర గ్రూప్‌నకు చెందిన ఆన్‌లైన్ మెటర్నిటి, చైల్డ్‌కేర్ బ్రాండైన ‘బేబీఓయ్’ను ఫస్ట్‌క్రై హస్తగతం చేసుకుంటోంది. ఈ ఒప్పందం ప్రకారం మహీంద్ర రిటైల్‌కు 354.6 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీ షేర్లను ఫస్ట్‌క్రై జారీ చేయనుంది. అలాగే మరో 7.5 కోట్ల రూపాయలనూ ఇవ్వనుంది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు మహీంద్ర రిటైల్ తెలిపింది. ఇక ఇరు సంస్థలు విలీన సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించగా, మహీంద్ర గ్రూప్‌తోపాటు ఈక్విట్ ఫండ్ అడ్వెఖ్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్, ఇతర ప్రస్తుత భాగస్వాముల నుంచి ఫస్ట్‌క్రై కూడా 34 మిలియన్ డాలర్ల నూతన ఈక్విటీ క్యాపిటల్‌ను అందుకుంటోంది. ఇకపోతే విలీన సంస్థ.. ఫస్ట్‌క్రై డాట్‌కామ్ పేరుతోనే వ్యాపార కార్యకలాపాలను నడిపించనుం ది. ఇప్పటికే ఇరు సంస్థల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఈ వ్యూహాత్మక ఒప్పందానికి అంగీకరించగా, దేశవ్యాప్తంగా 120కిపైగా ‘బేబీఓయ్’ స్టోర్లు మహీంద్ర రిటైల్‌కున్నాయ. 2010 ఆఖర్లో 180కిపై గా స్టోర్లతో ఫస్ట్‌క్రై వ్యాపారాన్ని ఆరంభించింది.