బిజినెస్

జరిగేదంతా మంచికే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్కా/బెనౌలియమ్ (గోవా), అక్టోబర్ 15: భారత్‌కు సంబంధించి అంతా మంచే జరుగుతోందని, ఆసియా దేశాల్లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్.. ఆకస్మిక ప్రగతికి నాందిగా నిలుస్తుందని న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డిబి) అధ్యక్షుడు, సీనియర్ బ్యాంకర్ కెవి కామత్ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఇక్కడ పిటిఐతో మాట్లాడుతూ రాబోయే ఏడాది, ఏడాదిన్నర కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న విశ్వాసాన్ని కనబరిచారు. సంపద సృష్టిలో ఆశ్చర్యపరుస్తుందన్నారు.
ద్రవ్యోల్బణం అదుపు, వడ్డీరేట్ల తగ్గింపు, కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు వంటివి దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించగలవని అన్నారు. ‘అంతా మంచే జరుగుతోంది. నాకైతే చాలా కోణాల్లో భారత్ మెరుగ్గా కనిపిస్తోంది.’ అన్నారు. ముఖ్యంగా ఆహార నిర్వహణలో సంస్కరణలు, నల్లధనం వెలికితీతలో భాగంగా ప్రవేశపెట్టిన ఆదాయ ధ్రువీకరణ పథకం (ఐడిఎస్) మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు. కాగా, షాంఘై కేంద్రంగా ఏర్పాటైన ఎన్‌డిబి తొలి అధ్యక్షుడిగా కామత్ ఎన్నికైనది తెలిసిందే. ఈ బ్యాంక్ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, చైనా, భారత్, దక్షిణాఫ్రికా) దేశాల ఆధ్వర్యంలో నడుస్తోంది. వచ్చే ఏడాదికల్లా బ్యాంక్ రుణ సామర్థ్యం రెట్టింపు కావాలని సభ్య దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
బ్రిక్స్ రేటింగ్ ఏజెన్సీ ఉండాలి
ఇదిలావుంటే బ్రిక్స్ దేశాల మద్దతుతో ఓ కొత్త క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఏర్పాటును ఎన్‌డిబి అధ్యక్షుడైన కామత్ ఈ సందర్భంగా తెరపైకి తెచ్చారు. ప్రపంచంలో మూడు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలు (మూడీస్, ఫిచ్, స్టాండర్డ్ అండ్ పూర్స్) భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల క్రెడిట్ రేటింగ్‌ను తక్కువగా చూపుతున్నాయన్నారు. ఎఎఎ మైనస్ రేటింగ్ తగునా? అని ప్రశ్నించారు.
అమెరికాకు చెందిన ఈ మూడు రేటింగ్ ఏజెన్సీల తీరుతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయన్నారు. అందుకే బ్రిక్స్ దేశాలు సొంతంగా ఓ రేటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. బ్రిక్స్ మద్దతున్న ఎన్‌డిబి చాలా దేశాల్లో బాండ్ల జారీ ద్వారా నిధుల సేకరణకు దిగాలని చూస్తోందని, అయితే బ్రిక్స్ దేశాలకున్న నాసిరకపు రేటింగ్‌తో నిధుల సమీకరణ లక్ష్యాలు నెరవేరేలా కనిపించడం లేదన్నారు. కాబట్టి తమకంటూ ఓ బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకున్నట్లే, ఓ రేటింగ్ ఏజెన్సీని కూడా బ్రిక్స్ దేశాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని కామత్ బలంగా వాదించారు. దీనివల్ల బ్యాంకుతో ఆర్థిక అవసరాలు తీరినట్లే, రేటింగ్ ఏజెన్సీతో తదనుగుణ ప్రయోజనాలు కలుగుతాయన్నారు.
భారత్, రష్యా సంయుక్త నిధి
మరోవైపు తొలిసారిగా భారతీయ వౌలిక రంగంలోకి 500 మిలియన్ డాలర్ల నిధులను పంపేందుకు రష్యా అంగీకరించింది. మరో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులను కొత్తగా ఏర్పాటైన నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇనె్వస్ట్‌మెంట్ ఫండ్ (ఎన్‌ఐఐఎఫ్) పెడుతోంది. బిలియన్ డాలర్లతో ‘రష్యన్ ఇండియన్ ఇనె్వస్ట్‌మెంట్ ఫండ్’ పేరిట ఓ సంయుక్త నిధిని ఏర్పాటు చేయాలని రష్యా యోచి స్తోంది. ఇరు దేశాల కలయికతో ఏర్పాటయ్యే ఈ నిధిలోకి రష్యన్ డైరెక్ట్ ఇనె్వస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డిఐఎఫ్) 500 మిలియన్ డాలర్లను పంపించనుంది. ‘్భరత్‌లో రష్యా వ్యాపార కార్యకలాపాల వృద్ధికి, పెట్టుబడుల అవకాశాలను ఆకట్టుకోవడానికి ఈ నిధి ఎంతగానో దోహదపడుతుంది.’ అని ఆర్‌డిఐఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కిరిల్ దిమిత్రియేవ్ అన్నారు.