బిజినెస్

విశాఖలో పెట్రోలియం యూనివర్శిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 17: రాష్ట్ర విభజన తరువాత కేంద్రం.. ఏపికి కేటాయించిన, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో భాగంగా మంజూరైన పెట్రోలియం యూనివర్శిటీని విశాఖలో నెలకొల్పనున్నారు. విశాఖకు సమీపంలోని సబ్బవరం దగ్గర సుమారు 300 ఎకరాల్లో యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నారు. నిర్మాణ పనులు రెండేళ్లలో పూర్తి చేయనున్నారు. ఈ యూనివర్శిటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలో ఇప్పటికే చమురు శుద్ధి కర్మాగారాలు పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయి. త్వరలోనే ప్రభుత్వరంగ సంస్థ అయన హెచ్‌పిసిఎల్ విస్తరణ జరగబోతోంది. ఇటువంటి తరుణంలో పెట్రోలియం యూనివర్శిటీ విశాఖకు రావడం ముదావహం.
వృత్తి నైపుణ్య విశ్వవిద్యాలయం
మరోవైపు దేశంలోనే రెండో వృత్తి నైపుణ్య శిక్షణ విశ్వవిద్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయనున్నారు. విశాఖ శివారు సబ్బవరం మండల పరిధిలో పెట్రోలియం యూనివర్శిటీకి అనుబంధంగా వృత్తి నైపుణ్య విశ్వవిద్యాలయం పనిచేస్తుంది. దేశంలో భువనేశ్వర్ మినహా మరెక్కడా ఇటువంటి యూనివర్శిటీ లేకపోవడం గమనార్హం. విశాఖలో పెట్రోలియం సంస్థలు ఇప్పటికే నెలకొనడం, భవిష్యత్‌లో పెట్రో కెమికల్స్ పెట్రో ఇనె్వస్ట్‌మెంట్ రీజియన్ (పిసిపిఐఆర్) రాకతో మరిన్ని అనుబంధ పరిశ్రమలు నెలకొనే అవకాశం ఉండటంతో ఈ యూనివర్శిటీకి ప్రాధాన్యత పెరగనుంది. వృత్తి నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని సబ్బవరంలోనే 100 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం.
డిజిటల్ తరగతులకు శ్రీకారం
ఇదిలా ఉండగా టెక్నాలజీకి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. దాన్ని మరింత వేగంగా ప్రజలకు చేరువ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందు లో భాగంగా విద్యార్థులకు డిజిటల్ తరగతులను అందుబాటులోకి తీసుకువస్తోంది. దేశంలోనే తొలిసారిగా డిజిటల్ తరగతులను ఆంధ్రా యూనివర్శిటీలో ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 219 తరగతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించనున్నారు. దీంతో సాంకేతిక పరిజ్ఞానం మరింత అందుబాటులోకి వస్తున్నట్లైంది. సుమారు ఏడు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ప్రవాస భారతీయుడు 50 శాతం ఆర్థిక సాయం అందించగా, మిగతాది మానవ వనరుల మంత్రిత్వ శాఖ భరిస్తోంది. కాగా, విశాఖలోని వుడా కాంప్లెక్స్‌లో అమెరికాకు చెందిన తొమ్మిది కొత్త ఐటి కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించనున్నారు.