బిజినెస్

జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని అఖిల భారత వాణిజ్య పన్నుల శాఖ అధికారుల, ఉద్యోగుల సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సోమవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు 29 రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 3 వేల మంది వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు. కౌన్సిల్ సమావేశాల్లో రాష్ట్రాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకపొతే 20వ తేదీన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని అధికారులు, ఉద్యోగుల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు సూర్యనారాయణ రావు హెచ్చరించారు.
పత్తి ధరలకు రెక్కలు
రూ. 5,200 పలికిన క్వింటాల్
జమ్మికుంట, అక్టోబర్ 17: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్‌లో తెల్ల బంగారానికి రెక్కలొచ్చాయి. గత వారం మార్కెట్ చివరి రెండు రోజుల నుండి పెరిగిన పత్తి ధర క్రమేణా పుంజుకుంటోంది. సోమవారం జమ్మికుంట యార్డుకు సుమారు 80 వాహనాల్లో 998 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి రాగా, ధర క్వింటాల్‌కు గరిష్ఠంగా 5,200 రూపాయలు పలికింది. కనిష్ట ధర 4,300 రూపాయలు, మోడల్ ధర 5,000 రూపాయల చొప్పున పలికింది. అలాగే బస్తాల విషయానికొస్తే సుమారు 3 వేల బస్తాల్లో 1,481 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా, గరిష్ఠ ధర క్వింటాల్‌కు 5,000 రూపాయలు, కనిష్ట ధర 3,750 రూపాయలు, మోడల్ ధర 4,800 రూపాయలుగా నమోదైంది. యార్డులో పత్తి క్రయవిక్రయాలను వేలం పద్ధతిన చేపట్టారు. ఉదయానే్న కొనుగోళ్లు ప్రారంభించి మధ్నాహ్నానికల్లా పూర్తి చేశారు. మార్కెట్ యార్డు చైర్మన్ పింగిలి రమేశ్, వైస్ చైర్మన్ ఎరబెల్లి రాజేశ్వర్‌రావుతోపాటు కార్యదర్శి వెంకట్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు యార్డులో క్రయవిక్రయాలను పర్యవేక్షించారు.