బిజినెస్

పొగాకు సాగులో కాంట్రాక్టు పద్ధతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, అక్టోబర్ 17: పొగాకు సాగుపై అంతర్జాతీయ స్థాయిలో కాంట్రాక్టు పద్ధతి ప్రతిపాదన తెరపైకి వస్తోందని కేంద్ర పొగాకు బోర్డు వేలం నిర్వాహకుడు బిఎన్ మిత్రా తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మన దేశంలో పొగాకు ఉత్పత్తిని కాంట్రాక్టు పద్ధతిలో చేసేందుకు కొన్ని దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు ప్రతిపాదిస్తున్నారన్నారు. ఈ ప్రతిపాదనలపై ఏ విధంగా స్పందించాలనే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్టు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు వేలం కేంద్రంలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. పొగాకు సాగు విస్తీర్ణం, ఉత్పత్తి తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని భావిస్తే ఈ కాంట్రాక్టు సాగు విధానంపై కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేయాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రతిపాదన అమలు జరిపితే పొగాకు మార్కెట్ కొంతవరకు మెరుగుపడవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయ బ్రాండ్ ఇమేజ్‌ను అంతర్జాతీయంగా కాపాడుకోవాలంటే నాణ్యమైన పొగాకును ఉత్పత్తి చేయాలని మిత్రా పేర్కొన్నారు. ముఖ్యంగా పురుగు మందుల అవశేషాలు లేని పొగాకుకే అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉంటుందని గుర్తుచేశారు. ఈ ఏడాది కర్ణాటకలో 92 మిలియన్ కిలోల పొగాకు పంటకు అనుమతి ఇచ్చారని, ప్రస్తుతం వంద మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఎల్‌ఎస్, ఎస్‌బిఎస్ ఏరియాల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా కేవలం మూడు శాతం మాత్రమే నాట్లు పూర్తయ్యాయన్నారు. గత సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ నాటికి 60 శాతం నాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. సమావేశంలో దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం నిర్వహణాధికారి వైవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

విలేఖరులతో మాట్లాడుతున్న పొగాకు బోర్డు వేలం మేనేజర్ మిత్రా