బిజినెస్

అదానీ పోర్ట్స్ లాభం రూ. 1,091 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎపిసెజ్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 1,091 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌తో పోల్చితే ఇది 61 శాతం అధికమవగా, నాడు సంస్థ లాభం 678 కోట్ల రూపాయలు. ఏకీకృత ఆదాయం ఈసారి 2,183 కోట్ల రూపాయలుగా, నిరుడు 1,808 కోట్ల రూపాయలుగా ఉందని మంగళవారం సంస్థ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపింది. అయితే సంస్థాగత వ్యయం కూడా క్రిందటిసారితో చూస్తే 898 కోట్ల రూపాయల నుంచి 1,014 కోట్ల రూపాయలకు పెరిగింది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్
ఇక అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఏకీకృత నికర లాభం ఈ జూలై-సెప్టెంబర్‌లో 79 శాతం క్షీణించి 63 కోట్ల రూపాయలకు పడిపోయింది. నిరుడు ఇది 299 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 7,594 కోట్ల రూపాయలుగా, పోయినసారి 9,075 కోట్ల రూపాయలుగా ఉంది.
అదానీ పవర్
మరోవైపు అదానీ పవర్ ఏకీకృత నష్టం 114 కోట్ల రూపాయలుగా నమోదైంది ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో. గత జూలై-సెప్టెంబర్‌లో ఇది 411 కోట్ల రూపాయలుగా ఉండటం గమనార్హం. ఆదాయం ఈసారి 5,776 కోట్ల రూపాయలుగా, పోయినసారి 5,751 కోట్ల రూపాయలుగా ఉంది.

‘విద్యుత్ సంస్కరణల్లో దేశానికే ఎపి ఆదర్శం’

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 25: విద్యుత్ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికి మార్గదర్శిగా నిలిచిందని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. వచ్చే నెలాఖరులోగా రాష్ట్రంలో ఎల్‌ఈడి వీధి దీపాల అమర్చే కార్యక్రమం పూర్తవుతుందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని, అందరికీ విద్యుత్ కింద మిగులు విద్యుత్ సాధించామన్నారు. పరిశ్రమలకు, వ్యవసాయానికి అవాంతరాలు లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ఇంధనాన్ని పొదుపు చేసే ఫ్యాన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. మంగళవారం విజయవాడలో ఎల్‌ఇడి వీధి దీపాల అమర్చడంలో నైపుణ్యత, ఇంజనీరింగ్ సాంకేతిక అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు.