బిజినెస్

భారతీ ఎయిర్‌టెల్ లాభం రూ. 1,461 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: దేశీయ టెలికామ్ రంగ దిగ్గజం, ప్రైవేట్‌రంగ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో గతంతో పోల్చితే 4.9 శాతం క్షీణించింది. 1,461 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో ఇది 1,536 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయి ఈసారి 24,671.5 కోట్ల రూపాయలుగా, పోయినసారి 23,851.9 కోట్ల రూపాయలుగా ఉందని మంగళవారం ఓ ప్రకటనలో భారతీ ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. అయితే దేశ, విదేశాల్లో టెలికామ్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న భారతీ ఎయిర్‌టెల్‌కు దేశీయంగా మాత్రం ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ప్రారంభించిన ఉచిత 4జి మొబైల్ సేవల కారణంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నది వాస్తవం. ఎయిర్‌టెల్ ఆదాయానికి గండి పడిందనే చెప్పాలి. అయినప్పటికీ ఆఫ్రికా దేశాల నుంచి ఆదాయం పెరగడం కలిసొచ్చింది. దీంతో స్వల్పంగానే లాభాలు తగ్గాయ.
క్షీణించిన డాక్టర్ రెడ్డీస్ లాభం
హైదరాబాద్: డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నికర లాభం ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 60 శాతం క్షీణించి 308.9 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు 774.7 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 3,616 కోట్ల రూపాయలుగా, పోయినసారి 4,020.7 కోట్ల రూపాయలుగా ఉందని మంగళవారం సంస్థ తెలిపింది.