బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 30: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 26వేల స్థాయిని కోల్పోగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 7,900 స్థాయిని చేజార్చుకుంది. గురువారంతో డిసెంబర్ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనున్న క్రమంలో మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణ వైపు నడిచారు. వచ్చే ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధి ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) చీఫ్ క్రిస్టినా లగార్డే ఓ జర్మనీ వార్తా పత్రికలో ప్రచురితమైన అతిథి వ్యాసంలో రాయడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. 2016లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచడానికి, చైనా ఆర్థిక మందగమనానికి ఉన్న అవకాశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒడిదుడుకులకు లోను చేయవచ్చని లగార్డే తన ఆర్టికల్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో మదుపరులు లాభాల స్వీకరణకు ఆసక్తి కనబరిచారు. ఫలితంగా సెనె్సక్స్ 119.45 పాయింట్లు క్షీణించి 25,960.03 వద్ద, నిఫ్టీ 32.70 పాయింట్లు నష్టపోయి 7,896.25 వద్ద స్థిరపడ్డాయి. నిజానికి ఆరంభంలో సూచీలు లాభాల్లోనే కదలాడినప్పటికీ చివరిదాకా ఆ ఉత్సాహం కొనసాగలేకపోయింది. ఐటి, టెక్నాలజీ, చమురు, గ్యాస్, బ్యాంకింగ్, పిఎస్‌యు, ఆటో, రియల్టీ రంగాల షేర్ల విలువ 1.21 శాతం నుంచి 0.17 శాతం మేర పడిపోయింది. ఆసియా, ఐరోపా మార్కెట్లలో మిశ్రమ స్పందన కనిపించింది.