బిజినెస్

హెరిటేజ్ ఫుడ్స్ చేతికి రిలయన్స్ రిటైల్ పాల వ్యాపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ పాల వ్యాపారాన్ని సొంతం చేసుకోనున్నట్లు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ శుక్రవారం తెలిపింది. ఈ మేరకు ఓ ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు చెప్పింది. ఈ ప్రతిపాదిత లావాదేవీకి రెగ్యులేటరీ ఆమోదాలు, ఇతరత్రా అనుమతులు రావాల్సి ఉందని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు హెరిటేజ్ ఫుడ్స్ తెలిపింది. కాగా, ఈ లావాదేవీతో పంజాబ్, ముంబయి, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తోపాటు ఉత్తరాఖండ్, రాజస్థాన్ మార్కెట్లలో హెరిటేజ్ పుంజుకుంటుందని ఇరు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇకపోతే డైరీ లైఫ్, డైరీ ప్యూర్ బ్రాండ్లతో దేశవ్యాప్తంగా రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ పాల ఉత్పత్తుల వ్యాపారం సాగుతోంది. పాల ప్యాకెట్లు, వెన్న, నెయ్యి, పెరుగు, స్వీట్లు, పాల పౌడర్ వంటిని విక్రయిస్తోంది. 10 రాష్ట్రాల్లోని 2,400 గ్రామాల నుంచి రోజుకు 2.25 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోంది. 2007లో ఈ సంస్థ మొదలవగా, గత ఆర్థిక సంవత్సరం (2015-16) సంస్థ ఆదాయం 553 కోట్ల రూపాయలుగా ఉంది.

గ్రీస్ ఎయిర్‌పోర్టు రేసులో జిఎమ్‌ఆర్

హైదరాబాద్/న్యూఢిల్లీ, అక్టోబర్ 28: గ్రీస్ దేశంలో దాదాపు 850 మిలియన్ యూరోల విలువైన ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు కోసం భారతీయ వౌలికరంగ దిగ్గజం జిఎమ్‌ఆర్ గ్రూప్ పోటీపడుతోంది. ఈ రేసులో జిఎమ్‌ఆర్‌తోపాటు గ్రీస్‌కు చెందిన జిఇకె టెర్నా సంస్థ కూడా ఉంది. గ్రీస్‌లోని అతిపెద్ద దీవి అయిన క్రెటె ఐస్‌లాండ్‌లో పెద్ద నగరమైన హెరాక్లియోన్‌లో ఈ నూతన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గ్రీస్ నిర్మించనుంది. కాగా, ఈ ప్రాజెక్టు తమకే వస్తుందన్న ఆశాభావాన్ని జిఎమ్‌ఆర్ వ్యక్తం చేసింది. మరోవైపు జిఇకె టెర్నా అధికార ప్రతినిధి కూడా ఇదే విశ్వాసాన్ని పిటిఐతో వెలిబుచ్చారు.