బిజినెస్

రూ. 10 వేల కోట్లు పట్టుకెళ్లారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: భారతీయ మార్కెట్ల నుంచి అక్టోబర్ నెలలో విదేశీ మదుపరులు (ఎఫ్‌పిఐ) 10,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసుకున్నారు. సెప్టెంబర్‌లో పెట్టుబడులను తీసుకొచ్చిన మదుపరులు.. అక్టోబర్‌లో మాత్రం వెనక్కి తగ్గారు. ముఖ్యంగా రుణ మార్కెట్ల నుంచి భారీ స్థాయలో పెట్టుబడులను ఎఫ్‌పిఐలు ఉపసంహరించుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వడ్డీరేట్ల తగ్గింపు దీనికి ప్రధాన కారణమని, బాండ్లకు డిమాండ్ తగ్గడంతో రుణ మార్కెట్లు పడిపోయాయని ఎస్‌ఎఎస్ ఆన్‌లైన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సిద్ధాంత్ జైన్ అన్నారు. దీంతో రుణ మార్కెట్ల నుంచి అక్టోబర్‌లో 6,000 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తరలిపోయాయ. సెప్టెంబర్లో 9,789 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం గమనార్హం. స్టాక్ మార్కెట్ల నుంచి కూడా 4,306 కోట్ల రూపాయల పెట్టుబడులు వెనక్కిపోయాయ. దీంతో అటు రుణ, ఇటు స్టాక్ మార్కెట్ల నుంచి అక్టోబర్‌లో 10,306 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తరలిపోయనట్లైంది.
మార్కెట్లలోకి రూ. 8 వేల కోట్ల
ఎమ్‌ఎఫ్ పెట్టుబడులు
మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి అక్టోబర్‌లో మ్యూచువల్ ఫండ్స్ (ఎమ్‌ఎఫ్) పెట్టుబడులు 8,000 కోట్ల రూపాయలకుపైగా వచ్చాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల విలువ 21,000 కోట్ల రూపాయలకుపైగా నమోదైంది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)కు పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో ఆమోదం లభించడం మదుపరులను ఆకట్టుకుందని మార్కెట్ వర్గాలు విశే్లషిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్లలోకి అక్టోబర్‌లో 8,100 కోట్ల రూపాయల పెట్టుబడులను మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు తెచ్చారని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గణాంకాలు తెలియజేస్తున్నాయి.