బిజినెస్

ఆంధ్రాను ఆదుకున్న వాణిజ్య పన్నులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 1: ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్‌ను వాణిజ్య పన్నుల ఆదాయం ఆదుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో గడచిన ఏడు నెలల్లో దాదాపు 8,283.94 కోట్ల రూపాయల ఆదాయం దక్కింది. వాణిజ్యపరమైన అన్ని అంశాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతోపాటు వ్యవహారాలు ఆన్‌లైన్‌లో చేపట్టడం వల్ల లోపాలను ప్రభుత్వం పూరించగలిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి అక్టోబర్ 7వ తేదీ వరకూ గణాంకాలు తీస్తే ఈ వివరాలు తెలిశాయి. 13 ఆదాయ పన్ను డివిజన్లలో ఆదాయపరంగా నాలుగు అంకెలతో మొదటి రెండు స్థానాల్లో విజయవాడ-2, విశాఖపట్టణం ఉన్నాయి. విజయవాడ-2 డివిజన్ నుండి 2,666.26 కోట్లు రాగా, విశాఖపట్టణం డివిజన్ నుండి 1,080.76 కోట్లు లభించింది. విజయవాడ-1 డివిజన్ నుండి 701.91 కోట్లు, చిత్తూరు నుండి 587.86 కోట్లు, నెల్లూరు నుండి 550.88 కోట్లు, కాకినాడ నుండి 587.12 కోట్లు, గుంటూరు నుండి 473.36 కోట్లు దక్కింది. అనంతపురం నుండి 316 కోట్లు, ఏలూరు నుండి 294.99 కోట్లు, నరసరావుపేట నుండి 293.94 కోట్లు, కర్నూలు నుండి 303.76 కోట్లు, కడప నుండి 224.47 కోట్లు, విజయనగరం నుండి 189.47 కోట్లు ఆదాయం లభించింది. సర్కిళ్ల వారీ చూస్తే అత్యధికంగా ఎల్‌టియు విజయవాడ-2 సర్కిల్ నుండి 1,715.34 కోట్లు వసూలు అయ్యింది. అత్యల్పంగా వినుకొండ సర్కిల్ నుండి 5.32 కోట్లు వసూలు అయ్యింది. ఉత్పత్తుల వారీ చూస్తే పెట్రో ఉత్పత్తులకు సంబంధించి అత్యధికంగా 5,110.68 కోట్లు వచ్చింది. ఆ తర్వాత మద్యం ఉత్పత్తుల నుండి 4,888.17 కోట్లు, సిగరెట్ ఉత్పత్తుల నుండి 407.32 కోట్లు ఆదాయం లభించింది. ఈ ఏడాది అక్టోబర్ వరకూ 1,84,756 సంస్థలు రిజస్టర్ అయ్యాయి. రాష్ట్రంలో ఆధార్ నెంబర్ ఉన్న డీలర్లు 1,81,816 మందిగా గుర్తించారు. కాగా, ప్రభుత్వంలో అన్ని శాఖల మాదిరి వాణిజ్య పన్నుల శాఖలోనూ ఆన్‌లైన్ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ఈ శాఖలో లావాదేవీలు చాలా వరకూ ఆన్‌లైన్‌లో జరిగిపోతున్నాయి. అక్టోబర్ నెలలో ఆన్‌లైన్‌లో వ్యాట్ రిటర్న్ దాఖలు చేసిన వారు 1,57,158 మంది, సిఎస్టీ రిటర్న్ దాఖలు చేసిన వారు 95,559 మంది ఉన్నారు. ఆన్‌లైన్‌లో 59,821 చెల్లింపులు జరిగాయి. 30,058 చెల్లింపులు మాన్యువల్‌గా జరిగాయి. అక్టోబర్‌లో 24,77,174 వేబిల్లులను ఆన్‌లైన్‌లోనే జారీ చేశారు.