బిజినెస్

వచ్చేనెల వడ్డీరేట్లు తగ్గొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 6: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ).. వచ్చే నెల నిర్వహించే ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లను మరింతగా తగ్గించవచ్చని ప్రముఖ విదేశీ బ్రోకరేజ్ సంస్థ హెచ్‌ఎస్‌బిసి అంచనా వేసింది. క్రిందటి ద్రవ్యసమీక్షలోనూ ఆర్‌బిఐ.. రెపో, రివర్స్ రెపో రేట్లను పావుశాతం తగ్గించిన నేపథ్యంలో అదే ధోరణి డిసెంబర్ ద్రవ్యసమీక్షలోనూ కొనసాగించే వీలుందని హెచ్‌ఎస్‌బిసి పేర్కొంది. వడ్డీరేట్లు తగ్గుతాయా? యథాతథంగా ఉంటాయా? అన్న మిశ్రమ అంచనాల మధ్య ఆశ్చర్యకరంగా ఆర్‌బిఐకి కొత్త గవర్నర్‌గా వచ్చిన ఉర్జిత్ పటేల్.. ఆరుగురు సభ్యులతో ఏర్పాటైన ద్రవ్యవిధాన కమిటీ (ఎమ్‌పిసి) వడ్డీరేట్లను తగ్గించినది తెలిసిందే. కాగా, డిసెంబర్‌లో వడ్డీరేట్లు తగ్గే అవకాశాలున్నాయన్న హెచ్‌ఎస్‌బిసి ఇండియా ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారి.. ఆ తర్వాత వడ్డీరేట్లు తగ్గుతాయని తాము భావించడం లేదన్నారు. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలుండటమే దీనికి ప్రధాన కారణమని, ఏడో వేతన సంఘం సిఫార్సులు, పెరుగుతున్న ఇంటి అద్దెలు, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు, ఆర్థికలోటు లక్ష్యాల సమీక్ష వంటివి ఆర్‌బిఐకి వడ్డీరేట్లను తగ్గించడానికి ఉన్న అవకాశాలను తక్కువ చేస్తున్నాయని పిటిఐతో ప్రంజుల్ అన్నారు. ఇకపోతే 2018 మార్చి నాటికి ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి తగ్గించాలన్న ఆర్‌బిఐ లక్ష్యంపై మాట్లాడుతూ అది పెద్ద సవాలేనని ఆమె అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం 5 శాతానికి వచ్చినా 4 శాతానికి తీసుకురావడం అంటే కష్టమేనన్నారు.