బిజినెస్

చైనా పట్టు దిగుమతులు తగ్గిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, నవంబర్ 6: చైనా నుంచి పట్టు దిగుమతిని తగ్గించి, దేశంలోనే పట్టు ఉత్పత్తిని పెంచడం ద్వారా పట్టు పరిశ్రమను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని జాతీయ సిల్క్ బోర్డు చైర్మన్ కెఎం హనుమంతరాయప్ప తెలిపారు. ఆయన ఆదివారం కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బిజెపి కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం దేశం మొత్తం మీద 28 వేల మెట్రిక్ టన్నుల పట్టు ఉత్పత్తి ఉండగా, కర్ణాటక రాష్ట్రంలోనే 50 శాతం ఉత్పత్తి జరుగుతోందన్నారు. అందువల్ల పట్టు ఉత్పత్తిని దేశ వ్యాప్తంగా పెంచడానికి పట్టు రైతులకు, చేనేత కార్మికులకు అనేక సహాయక చర్యలు తీసుకున్నామన్నారు. పట్టు కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి దక్షిణ భారతంలో ఒక్క బెంగళూరు నగర సమీపంలోని రామనగర్‌లో అతిపెద్ద మార్కెట్ ఉందన్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా రైతులు పట్టు గూళ్లను అమ్ముకోవడానికి రామ్‌నగర్‌కు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వారి ఇబ్బందులను గుర్తించి కర్ణాటకలో హవేరి, ఆంధ్రలో పలమనేరు, మహారాష్టల్రో సాంగ్లీ ప్రాంతాల్లో పట్టుగూళ్ళ మార్కెట్లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. పట్టు పరిశ్రమకు మహారాష్ట్ర, ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల్లో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని, ఈ రాష్ట్రాల్లో పట్టు పరిశ్రమల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. దీంతో ఈ మూడు రాష్ట్రాల్లో పట్టు గూళ్లు పెంచే రైతులకు, చేనేత కార్మికులకు సిల్క్ బోర్డు అనేక ప్రోత్సాహకాలు అందిస్తుందని వివరించారు. శ్రీనగర్‌లో మంచి రేష్మి పట్టు ఉత్పత్తి అవుతుందని, అయితే ఇటీవల శ్రీనగర్‌లో జరుగుతున్న అల్లర్ల దృష్ట్యా పట్టు ఉత్పత్తికి అంతరాయం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చైనా, కొరియా, జపాన్ దేశాల నుంచి దేశానికి పట్టు దిగుమతి అవుతున్నా.. చైనా నుంచి అధిక భాగం పట్టును దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. అయతే చైనా పట్టు దిగుమతులను తగ్గించి దేశానికి అవసరమైన పట్టును ఇక్కడే ఉత్పత్తి చేయడానికి వివిధ రాష్ట్రాల్లో పట్టు గూళ్ల పంటలపై రైతులకు ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మల్బరీ పంటకు కావాల్సిన సామగ్రిని 50 శాతం సబ్సిడీతో, డ్రిప్ ఇరిగేషన్‌కు 60 శాతం సబ్సిడీని రైతులకు అందిస్తామన్నారు. పట్టు నుంచి దారం తీసే మల్టీ మిషన్ ధర రూ. 14 లక్షలవగా, రూ. 10 లక్షల సబ్సిడీని అందిస్తున్నామని తెలిపారు. అలాగే ఆటోమేటిక్ రీలింగ్ మిషన్ ధర రూ. 1.3 కోట్లుండగా, రూ. 65 లక్షలు సబ్సిడీ ఇస్తున్నామన్నారు. అహింసా రేష్మిపట్టు తయారు చేయడానికీ చర్యలు తీసుకున్నామన్నారు. అహింసా పట్టు అంటే పట్టు గూళ్లలో ఉన్న పురుగును తీసి పట్టు ద్వారా మాత్రమే దారం తీస్తామన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి, పలమనేరు ప్రాంతాల్లో ఎక్కువ శాతం చేనేతలు ఉన్నందువల్ల వారితో సమావేశం ఏర్పాటు చేసి పట్టు ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం ఇస్తున్న సహకారాన్ని వివరించామన్నారు.