బిజినెస్

మార్కెట్ చూపు ‘అమెరికా’ వైపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 6: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఈ వారం భారతీయ స్టాక్ మార్కెట్లను అమితంగా ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటే దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్)గాను ప్రకటించే ఆర్థిక ఫలితాలు మదుపరుల పెట్టుబడులను నిర్దేశిస్తాయని వారు విశే్లషిస్తున్నారు. అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల బరిలో నిన్నమొన్నటిదాకా డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ముందుండగా, ఇప్పుడు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో కనిపిస్తున్నారు. దీంతో భారత్‌సహా ప్రపంచంలోని ప్రధాన దేశాల స్టాక్ మార్కెట్లన్నీ కూడా నష్టాల్లోకి జారుకున్నది తెలిసిందే. ఇందుకు కారణం ట్రంప్ దుందుడుకు స్వభావమే. మెజారిటీ దేశాలపై ఆయనకున్న అభిప్రాయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దన్నగా భావించే అమెరికాకు శత్రుత్వం పెంచుతుందన్న భయాలు మదుపరులలో ఉన్నాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే ఆ దేశానికేగాక, ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని మెజారిటీ మదుపరుల విశ్వాసం. ఈ క్రమంలోనే మదుపరులు స్టాక్ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను ప్రత్యామ్నాయ మార్గాల వైపునకు మళ్లిస్తున్నారు. ఫలితంగా నష్టాలు తప్పడం లేదు. ఇదే ధోరణి ఈ వారం కూడా ఉంటుందన్న అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే సెప్టెంబర్ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు కూడా స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులను శాసిస్తాయని అంచనా. బిహెచ్‌ఇఎల్, లుపిన్, బిపిసిఎల్, మహీంద్ర అండ్ మహీంద్ర వంటి అగ్రశ్రేణి సంస్థలు కూడా ఈ వారం తమ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్నాయి. దీంతో మదుపరులు సహజంగానే వీటి ఆధారంగా తమ పెట్టుబడులపై నిర్ణయం తీసుకుంటారని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇక గడచిన వారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ముగియగా, దీపావళితో మొదలైన కొత్త సంవత్సరం ‘సంవత్ 2073’లో తొలి వారానికి నష్టాలతో స్వాగతం పలికినట్లైంది. గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 667.36 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 204.25 పాయింట్లు పతనమయ్యాయి.
నేడు బాండ్ల వేలం
విదేశీ మదుపరులకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సోమవారం ప్రభుత్వ బాండ్లను వేలం వేయనుంది. 12,700 కోట్ల రూపాయలకుపైగా విలువైన ప్రభుత్వ రుణ సెక్యూరిటీలను అమ్మనుంది. సాధారణ ట్రేడింగ్ అయ్యాక మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటలపాటు వేలం జరుగుతుంది.