బిజినెస్

బ్లాక్‌మనీపై మోడీ సర్జికల్ స్ట్రైక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8:‘బ్లాక్‌మనీపై మోడీ సర్జికల్ స్ట్రైక్’ ఐదువందల రూపాయలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించగానే ఫేస్‌బుక్‌లో నెట్‌జనుల కామెంట్ ఇది. నెట్ జనులు నోట్ల రద్దుపై వినూత్న రీతిలో స్పందించారు. అయితే అంతా పాజిటివ్‌గానే స్పందించడం విశేషం. మోడీ ఈ నిర్ణయంతో భారతీయ యువత మనసు దోచుకున్నారని పలువురు పేర్కొన్నారు. మరికొందరు ఐదు వందల రూపాయల నోట్లతో పల్లీల పొట్లం కట్టినట్టు ఒకరు ఫేస్‌బుక్‌లో ఫోస్ట్ చేశారు. అలాగే ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్ల ముందు దీపం వెలిగించి, రిప్ రెస్ట్ ఇన్ ఫీస్ అని కొందరు పోస్ట్ చేశారు. కాగా, పలువురు ప్రముఖులు ట్విట్టర్‌లో ప్రధాన మంత్రి నిర్ణయంపై స్పందించారు. రెండు వేల రూపాయల నోట్ పింక్ రంగులో ఉంది. ఇది పింక్ ఎఫెక్ట్ అని తాము నటించిన పింక్ సినిమాను బాలీవుడ్ నటులు ప్రస్తావించారు. అవినీతి నిర్మూలనకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కొనియాడారు.
మరికొన్ని కామెంట్లు..
‘పది రూపాయల బిక్షం వేయమంటే వేల రూపాయల నోట్లు వేస్తున్నావేమిటి? ఓ బిక్షగాడు కోపంగా..’
‘అమెరికన్లు ఓట్లు లెక్కిస్తుంటే భారతీయులు నోట్లు లెక్కిస్తున్నారు.’