బిజినెస్

స్వాగతించిన టిఫ్యాప్సీ, సిఐఐ తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: కేంద్రం ఐదు వందలు, వెయ్యి రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేయడంపై సిఐఐ తెలంగాణ ఆహ్వానించింది. కాగా మరో ఆర్ధిక నిపుణుడు హరగోవింద్ ప్రసాద్ మాత్రం ఐదు కోట్ల మంది ఆదాయం పన్ను శాఖ చెల్లించేవారిని టార్గెట్ చేసేందుకు 120 కోట్ల మందికి తీవ్ర ఇక్లట్లు కలిగిస్తున్నారని, ఇది ఒక రకంగా చెప్పాపెంటకుండా వేసిన హీరోషీమా, నాగసాకి బాంబు లాంటిదని అన్నారు.
సిఐఐ తెలంగాణ చైర్మన్ దేవేందర్ సురానా మాట్లాడుతూ, ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. ఒక నెల రోజులు ఇబ్బంది ఉంటుంది. కాని అన్ని పరిస్ధితులు వచ్చే నెల రోజుల్లో సర్దుకుంటాయి. స్టాక్ మార్కెట్ కొంత మందగిస్తుంది. కాని డిసెంబర్ 15 తర్వాత పరిస్ధితి మారుతుంది. పైగా రద్దయిన కరెన్సీ నోట్లనుమార్చుకునేందుకు సమయం ఇచ్చారు. చిన్న వ్యాపారులు, దిగువ వర్గాల వాళ్లకు కొంత ఇబ్బంది వాస్తవమే.కాని దేశ ప్రయోజనాల దృష్ట్యా ధైర్యమైన నిర్ణయాలు తీసుకోకతప్పదని సురానా అన్నారు.
పారిశ్రామికవేత్త హరిగోవింద్ ప్రసాద్ మాట్లాడుతూ ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్లు ఒక్కసారి ఐదు వందలు, వెయ్యి నోట్ల కరెన్సీ రద్దుచేస్తే సామాన్యుల జీవితం అతలాకుతలమవుతుందన్నారు. పెళ్లిళ్ల సీజన్ ఇది. చిన్న వ్యాపారులు, చిట్‌ఫండ్ వ్యాపారం చేసే వారు ఏమవుతారు. చాలా మందికి ఈ దేశంలో బ్యాంకు అకౌంట్లు లేవు. వారి పరిస్ధితి ఏమిటి ? ఇది దుందుడుకు నిర్ణయమని భావిస్తున్నాను. రెండు రోజుల పాటు బ్యాంకులను బంద్ చేశారు. ఇలా చేస్తేత బడుగు జీవుల సంగతి ఏమిటి ? ఈ వార్త విన్న వెంటనే మార్కెట్‌లో గందరగోళం నెలకొంది. నల్లధనం నిర్నూలనకు కేంద్రం చర్యలు మంచివే. కాని ఇప్పటికిప్పుడు ఇలా రద్దు చేస్తే సాధారణ ప్రజలు తీవ్రమైన సంక్షోభానికి గురవుతారు అని ఆయన చెప్పారు.
తెలంగాణ, ఆంధ్ర ఫ్యాప్సీ అధ్యక్షుడు రవీంద్ర మోదీ మాట్లాడుతూ, సాహసోపేతమైన నిర్ణయమని శ్లాఘించారు. దీని వల్ల దేశంలో నల్లధనం నిర్మూలనవుతుందన్నారు. ఆర్ధికవ్యవస్ధకు వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. నల్ల వ్యాపారం చేసేవారికి కష్టాలు అని చెప్పారు. బ్యాంకుల ద్వారా రద్దయిన కరెన్సీని మార్చుకోవచ్చు. కొన్ని కష్టాలు ఉన్నా, ఆర్ధిక వ్యవస్ధగట్టెక్కుతుందన్నారు. ఈ నిర్ణయం వల్ల దేశానికి మంచి జరుగుతుందన్నారు.
బ్యాంకింగ్ నిపుణులు బి నరసింహమూర్తి మాట్లాడుతూ నల్లధనం చలామణి అరికట్టేందుకు, దొంగ నోట్ల కరెన్సీ చలామణిని నిర్మూలించేందుకు కేంద్రం అత్యంత సాహసమైన నిర్ణయం తీసుకుందని, దీని వల్ల సత్ఫలితాలు వస్తాయని చెప్పారు.