బిజినెస్

ఆర్థిక సంస్కరణలు ఆగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావడానికి అవసరమైన చర్యలను తీసుకోవడంలో వెనుకాడబోమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా సంస్కరణలను ప్రవేశపెడతామని, వౌలిక రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంగళవారం ఇక్కడ భారత్-యుకె టెక్ సదస్సులో జైట్లీ మాట్లాడారు. ‘ప్రపంచంలోని ఇతర ప్రధాన దేశాలతో పోల్చితే భారత్ వృద్ధిరేటు వేగంగా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థకున్న బలం ఇదే. అయితే ఈ వేగం మనల్ని సంతృప్తి పరచడం లేదు. మరింత వేగాన్ని సంతరించుకోవాలన్నదే భారత్ కల.’ అని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత ఇప్పుడిప్పుడే భారత్ మాట ప్రపంచంలో వినిపిస్తోంది అన్నారు. ‘తయారీ రంగాన్ని మరింత విస్తరించేందుకు పెట్టుబడులు అవసరం. ఆ పెట్టుబడులను ఆకర్షించేందుకు సంస్కరణలు అనివార్యం.’ అన్నారు. ఇక దేశంలో వౌలిక రంగం బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, రహదారులు, రైల్వే స్టేషన్లు ఆధునికీకరించాలని, అందుకు పెట్టుబడులు కావాల్సి ఉందన్నారు. మరిన్ని విమానాశ్రయాలు, సీపోర్టులు కూడా ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. వీటన్నిటికి నిధులు కావాలన్న జైట్లీ.. అందుకు తగ్గ విధాన నిర్ణయాలను తమ ప్రభుత్వం తీసుకుంటోందని చెప్పారు.