బిజినెస్

రూ. 40,000 పలికింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 9: కేంద్ర ప్రభుత్వం 500, 1,000 రూపాయల నోట్ల చలామణిని నిషేధించిన నేపథ్యంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పలికాయి. తమవద్ద భారీగా ఉన్న 500, 1,000 రూపాయల నోట్లను వదిలించుకోవడానికి సులభ మార్గం బంగారం కొనుగోళ్లేనని భావించిన అక్రమార్కులు పెద్ద ఎత్తున పుత్తడి కొనుగోళ్లకు దిగారు. దీంతో పసిడి మార్కెట్‌లో ఒక్కసారిగా పెరిగిన డిమాండ్.. 10 గ్రాముల ధరను ఏకంగా 10,000 రూపాయల మేర ఎగిసిపడేలా చేసింది. మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు జరిగిన కొనుగోళ్లు బుధవారం కూడా కొనసాగగా, 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారాన్ని గరిష్ఠంగా 40,000 రూపాయలకుపైగా పెట్టి కొనుగోలు చేసినట్లు వ్యాపార వర్గాలు వెల్లడించాయి. బ్యాంకులకు వెళ్లలేని బడా బాబులంతా బంగారం కొనుగోళ్లకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నాయి. రాత్రి 11 గంటల వరకు విక్రయాలు జరిగాయని నగల వర్తకులు చెబుతున్నారు. మరోవైపు బులియన్ మార్కెట్‌లోనూ పసిడి ధర మూడేళ్ల గరిష్ఠాన్ని చేరుతూ 900 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధర 1,150 రూపాయలు పెరిగి 45,000 రూపాయలను తాకింది. అటు గోల్డ్ ఇటిఎఫ్‌లు, సావరిన్ గోల్డ్ బాండ్లకు డిమాండ్ ఏర్పడింది.