బిజినెస్

మ్యాక్స్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ విలీనంపై ఐఆర్‌డిఎఐ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 12: బీమా రంగ నియంత్రిత వ్యవస్థ ఐఆర్‌డిఎఐ.. మ్యాక్స్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ విలీనాన్ని శనివారం ప్రశ్నించింది. దీంతో ఐఆర్‌డిఎఐకి ఈ విషయంపై స్పష్టతను ఇస్తామని ఇరు సంస్థ లు ప్రకటించాయి. మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎమ్‌ఎఫ్‌ఎస్‌ఎల్) అనుబంధ సంస్థ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపె నీ లిమిటెడ్ (ఎమ్‌ఎల్‌ఐసిఎల్), హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (హెచ్‌డిఎఫ్‌సి లైఫ్), మ్యాక్స్ ఇండియా మధ్య కుదిరిన ఓ ఒప్పందంలో భాగంగానే ఈ ప్రతిపాదిత బీమా వ్యాపార విలీన పథ కం. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 21న ఈ విలీనానికి ఆమోదం కోసం హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఎమ్‌ఎల్‌ఐసిఎల్ సంస్థలు ఐఆర్‌డిఎఐకి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే దరఖాస్తులను పూర్తిగా పరిశీలించిన ఐఆర్‌డిఎఐ.. విలీనంతో ఏర్పాటయ్యే సంస్థ గురించి ఆరా తీసింది. అన్ని నిబంధనలు విలీన ప్రక్రియలో అమలవుతున్నాయా? లేదా? అన్నదానిపై మరిన్ని వివరాలను కోరింది. మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను 2 బిలియన్ డాలర్ల మ్యాక్స్ గ్రూప్ ప్రమోట్ చేస్తోంది.