బిజినెస్

ఎన్నిసార్లయనా ఎటిఎమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 14: పాత 500, 1,000 రూపాయల నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలకు ఏర్పడిన అసౌకర్యాన్ని అధిగమించేందుకు పలు చర్యలు చేపడుతున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ).. తాజాగా డిసెంబర్ 30 వరకు ఎటిఎమ్ లావాదేవీలపై చార్జీలుండవని ప్రకటించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులకు ఆర్‌బిఐ సోమవారం సూచించింది. ఖాతా కలిగిన బ్యాంక్ ఎటిఎమ్‌నైనా, ఇతర బ్యాంకుల ఎటిఎమ్‌లనైనా సరే వినియోగదారులు స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చని తెలిపింది. ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలకూ ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల ఎటిఎమ్‌లు ఉండగా, వచ్చే నెల 30 వరకు ఎన్నిసార్లైనా కనిపించిన ఎటిఎమ్‌లను బ్యాంక్ ఖాతాదారులు వాడుకోవచ్చని చెప్పింది. తమ నిర్ణయం ఈ నెల 10 నుంచే అమల్లోకి వస్తుందని కూడా వివరించింది. కాగా, 2014 ఆగస్టులో సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారుల ఎటిఎమ్ లావాదేవీలపై పరిమితి తీసుకురాగా, తమ ఖాతాలు లేని బ్యాంకుల ఎటిఎమ్‌లను నెలకు మూడుసార్ల కంటే ఎక్కువ వినియోగించరాదని బ్యాంకులు పేర్కొన్నాయి. ఖాతాలున్న బ్యాంకుల ఎటిఎమ్‌లను ఐదుసార్లు వినియోగించుకోవచ్చు. మొత్తంగా నెలకు ఎనిమిదిసార్ల కంటే ఎక్కువగా ఎటి ఎమ్‌లను వాడకూడదు. అలా వాడినపక్షంలో ఒక్కో లావాదేవీకి బ్యాంకులు 20 రూపాయల చొప్పున వసూలు చేస్తాయి. అయితే కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం నేపథ్యంలో ఈ నిబంధనలను ఆర్‌బిఐ తాత్కాలికంగా సడలించింది.