బిజినెస్

పెళ్ళిళ్ల సీజన్‌కు ‘పెద్ద నోట్ల’ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, నవంబర్ 14: పెళ్ళిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. కిటకిటలాడే బట్టలు, నగల మార్కెట్ ఇప్పుడు బోసిపోతోంది. జనాల వద్ద డబ్బులు లేక కాదు.. ఉన్న డబ్బులు చెల్లక. అవును.. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేయడం పెళ్ళిళ్ల సీజన్ అమ్మకాలను దెబ్బ తీసింది. గార్మెంట్, జ్యుయెలరీ విక్రయాలు దారుణంగా పడిపోయాయి. పాత నోట్ల మార్పిడితో 2,000 రూపాయల నోట్లు వస్తున్నప్పటికీ, ఈ ప్రక్రియ వేగంగా లేకపోవడంతో ప్రజల వద్ద కొత్త నోట్లు కావాల్సినంతగా లేకుండాపోయాయి. ముఖ్యంగా 100 రూపాయల నోట్ల చలామణి తక్కువగా ఉండటం వ్యాపారులను తీవ్రంగా వేధిస్తోంది. కొత్త 500 రూపాయల నోట్ల సరఫరా ఇప్పుడిప్పుడే, అదికూడా అరకొరగా జరుగుతుండటంతో 2,000 రూపాయల నోట్ల చలామణికి భారీగా 100 రూపాయల నోట్లు అవసరమవుతున్నాయి. చిల్లరగా పెద్ద ఎత్తున వినియోగదారులకు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. బ్యాంకుల్లోనూ 100 రూపాయల నోట్లు పరిమితంగా ఉండటంతో అవి డిమాండ్‌ను అందుకోలేకపోతున్నాయి. 500 రూపాయల నోట్లు వస్తే సమస్యను కొంతమేర అధిగమిస్తామని వ్యాపారులు చెబుతుండగా, కేంద్రం నిర్ణయం ఎలా ఉన్నా.. చిల్లర సమస్యతో తమకు వ్యాపార నష్టాలు తప్పట్లేదని దుకాణదారులు వాపోతున్నారు. ఈ పెళ్ళిళ్ల సీజన్‌లో రోజుకు కనీసం 15 కోట్ల రూపాయల వ్యాపారం జరిగేదని, అయితే ఇప్పుడు అందులో 10 శాతం కూడా కావడం లేదని మధ్యప్రదేశ్ గార్మెంట్ అసోసియేషన్ ప్రతినిధి అజయ్ జైన్ అన్నారు. నిజానికి దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. రిటైల్, హోల్‌సేల్ విక్రయాలు భారీగా తగ్గిపోయాయని వాణిజ్య సంఘం సిఎఐటి చెబుతోంది. సాధారణంతో పోల్చితే 25 శాతం అమ్మకాలు పడిపోయాయంది. ఈ క్రమంలో సమస్యను త్వరగా పరిష్కరించే మార్గాలను అనే్వషించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి వాణిజ్య సంఘాలు విజ్ఞప్తి కూడా చేశాయి. ఇక అన్ని వ్యాపారుల సమస్య ఒకలా ఉంటే, నగల వ్యాపారుల సమస్య మరోలా ఉంది. అక్రమార్కులు తమ నల్లధనంతో పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు చేపడుతున్నారన్న వార్తలు జ్యుయెలరీ మార్కెట్‌ను కుదిపేస్తోంది. ఇప్పటికే కొన్నిచోట్ల ఐటి దాడులు జరగగా, మరికొన్ని చోట్ల ఐటి అధికారుల దృష్టి నగల మార్కెట్‌పైనే ప్రధానంగా ఉంది. 2 లక్షల రూపాయలు దాటి కొనుగోళ్లు జరిపితే పాన్ కార్డు వినియోగం తప్పనిసరి. అయితే వ్యాపారులు వివిధ పేర్లతో ఈ పరిమితికి తక్కువగానే బిల్లులు వేసి ఎక్కువ మొత్తంలో అక్రమ అమ్మకాలకు తెగబడుతున్నారన్న సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది. ఈ క్రమంలో లావాదేవీలు చాలా ఒత్తిడిలో జరుగుతున్నాయని, ఇది తమ వ్యాపారాన్ని కుంగదీస్తోందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. కిరణా, ఇతరత్రా చిన్న వ్యాపారాలూ చిల్లర సమస్యతో దెబ్బతిన్నాయి.