బిజినెస్

జెఎల్‌ఆర్ అమ్మకాల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 14: దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ద్వితీయ త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 848 కోట్ల రూపాయలు (పన్నుల తర్వాత)గా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో సంస్థ ఏకీకృత నష్టం 1,740 కోట్ల రూపాయలు (పన్నుల తర్వాత)గా ఉంది. విదేశీ మార్కెట్లలో జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) అమ్మకాలు భారీగా జరగడం టాటా మోటార్స్‌కు ఈసారి కలిసొచ్చింది. బ్రిటన్, ఐరోపా, ఉత్తర అమెరికా, చైనా తదితర దేశాల మార్కెట్లలో జెఎల్‌ఆర్ వాహన విక్రయాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఇక ఏకీకృత ఆదాయం 6.94 శాతం పెరిగి 67,000 కోట్ల రూపాయలుగా నమోదైనట్లు ఓ ప్రకటనలో సోమవారం టాటా మోటార్స్ తెలిపింది. నిరుడు 62,647 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా, స్టాండలోన్ ఆధారంగా సంస్థ నష్టం 631 కోట్ల రూపాయలకు పెరిగింది. క్రిందటిసారి 289 కోట్ల రూపాయలుగానే ఉంది. నికర అమ్మకాలు కూడా గతంతో చూస్తే 11,794 కోట్ల రూపాయల నుంచి 11,406 కోట్ల రూపాయలకు తగ్గాయి.
మరోవైపు సోమవారం ముంబయ లోని బాంబే హౌస్ వద్ద జరిగిన టాటా మోటార్స్ బోర్డు సమావేశానికి టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్ర్తి హాజరయ్యారు.

టాటా మోటార్స్ బోర్డు సమావేశానికి హాజరవుతున్న సైరస్ మిస్ర్తి