బిజినెస్

మెగా ‘ట్రేడ్ ఫెయిర్’ మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన (ఐఐటిఎఫ్-2016) ఇక్కడి ప్రగతి మైదాన్‌లో ఘనంగా మొదలైంది. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా ప్రారంభమైన ఈ 36వ ఎడిషన్ ప్రదర్శనలో 27 దేశాలకు చెందిన 150కిపైగా సంస్థలు పాల్గొంటున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణసహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పెవిలియన్లు ఇందులో కొలువుదీరాయి. ‘డిజిటల్ ఇండియా’ థీమ్‌తో ఆరంభమైన ఈ మెగా ట్రేడ్ ఫెయిర్ ఈ నెల 27 వరకు కొనసాగనుంది.
ఈ సందర్భంగా రాష్టప్రతి మాట్లాడుతూ భారతీయ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌లో మరింతగా రాణించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. డిజిటల్ టెక్నాలజీ, ఈ-కామర్స్, మొబైల్ సేవలు భారత్‌లో వేగంగా పెరుగుతున్నాయన్న ఆయన ఆర్థిక సంస్కరణలతో వ్యాపార నిర్వహణను భారత ప్రభుత్వం సులభతరం చేస్తోందని, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వంటి గొప్ప సంస్కరణలను అమల్లోకి తెస్తోందంటూ విదేశీ సంస్థలకు తెలియజేశారు. కీలకమైన చాలా రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు అవకాశాలున్నాయన్నారు. కాగా, భారత్- పాక్ ఉద్రిక్తతల మధ్య ఈ ప్రదర్శనలో పాక్ సంస్థలేవీ పాల్గొనలేదు. నిజానికి 126 పాకిస్తానీ సంస్థలు ముందుకొచ్చినప్పటికీ తర్వాత వెనుదిరిగాయి. మరోవైపు జన్ ధన్-ఆధార్-మొబైల్ ట్రినిటీ (జామ్)తో దేశంలోని పేదలకు అందించే రాయితీలు, ఇతరత్రా ప్రయోజనాల్లో అక్రమాలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోగలిగిందని, దీనివల్ల 36,000 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రదర్శనలో చెప్పారు. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 500, 1,000 రూపాయల నోట్ల రద్దు నిర్ణయం ఈ వాణిజ్య ప్రదర్శనను ప్రభావితం చేయబోదని ఆయన అన్నారు. అయితే ట్రేడ్ ఫెయిర్ వద్దనున్న ఎటిఎమ్ మెషీన్లలో నగదు పూర్తిగా అయిపోవడం కనిపించింది.

చిత్రం... ఐఐటిఎఫ్-2016 36వ ఎడిషన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పెవిలియన్లు