బిజినెస్

రూపాయి విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 24: పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రభావం, సమీప భవిష్యత్తులోనే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న భయాలు పెరిగిన నేపథ్యంలో డాలరుతో రూపాయి గురువారం దారుణంగా పడిపోయింది. ఒక దశలో డాలరుకు 68రూపాయల 86 పైసల స్థాయికి పడిపోయింది. అయితే రిజర్వ్ బ్యాంక్ జోక్యంతో కాస్తకోలుకుని రూ. 68.73 స్థాయి వద్దముగిసింది. 39 నెలల కాలంలో డాలరుతో రూపాయి ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. ఇదే ధోరణి కొనసాగితే సమీప భవిష్యత్తులోనే 70 రూపాయల స్థాయికి చేరుకోవచ్చని విశే్లషకులు అంటున్నారు. నిన్న ఫారెక్స్ మార్కెట్లో డాలరుకు 68.56 రూపాయల స్థాయి వద్ద ముగిసిన రూపాయి ఈ రోజు ఉదయం రూ.68.74 వద్ద అపారంభమై ఒక దశలో ఆల్‌టైమ్ తక్కువ అయిన 68.86 స్థాయికి పడిపోయింది. అయితే తర్వాత కాస్త కోలుకుని రూ.68.73 వద్ద ముగిసింది. నోట్ల రద్దు ప్రభావం, మార్కెట్లనుంచి విదేశీ నిధులు నారీ ఎత్తున తరలిపోవడం, విదేశీ కరెన్సీలతో డాలరు బలంగా ఉండడం, అమెరికాలో ఆర్థిక రంగం మెరుగుపడుతూ ఉండడం కూడా రూపాయిపై తీవ్ర ప్రభావం చూపించిందని నిపుణులు అంటున్నారు. గత అయిదు రోజుల్లో డాలరుతో రూపాయి 91 పైసలు పడిపోయింది. 2013 ఆగస్టు 8న మాత్రమే డాలరుతో రూపాయి ఇంత దారుణంగా పడిపోయింది. ఆ రోజు డాలరుతో రూపాయి 68.85 పైసల కనిష్టస్థాయికి పడిపోయినా చివరికి 68.80 రూపాయల స్థాయిలో ముగిసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చేనెల వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాల నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లనుంచి విదేశీ పెట్టుబడులను భారీగా ఉపసంహించుకుంటున్నారు. అలాగే నల్లధనాన్ని అదుపు చేయడానికి పెద్ద నోట్ల రద్దు తర్వాత రూపాయి భారీ ఆటుపోట్లకు గురవుతూ ఉండడం రూపాయిపై మరింత ఒత్తిడిని తీసుకు వచ్చిందని డీలర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీల విషయంలో డాలరు దాదాపు0.20 శాతం తక్కువగా ట్రేడ్ అవుతోంది. ఇదిలా ఉండగా రిజర్వ్ బ్యాంక్ గురువారం డాలరుకు రూ.68.65, యూరోకు 72.38 రూపాయలు రెఫరెన్స్ రేటుగా ఆర్‌బిఐ గురువారం నిర్ణయించింది.