బిజినెస్

రెండు రోజుల ముచ్చటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 24: వరసగా రెండు రోజులు లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లనుంచి విదేశీ పెట్టుబడులు భారీ ఎత్తున తరలివెళ్లిపోతుండడంతో డాలరుతో రూపాయి గతంలో ఎన్నడూ లేనంత కనిష్టస్థాయికి పడిపోయిన నేపథ్యంలో సెనె్సక్స్ 192 పాయింట్లు నష్టపోయి 26,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ సైతం దాదాపు 68 పాయింట్లు నష్టపోయి 8 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. నిన్నటి ముగింపుకన్నా కాస్త దిగువన 26,049.14 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెనె్సక్స్ అమ్మకాలు వెల్లువెత్తడంతో ఒక దశలో 25,810.97 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. అయితే లావాదేవీల చివర్లో ఎంపిక చేసిన షేర్లలో కొనుగోళ్లతో కాస్త కోలుకుని చివరికి 191.64 పాయింట్ల నష్టంతో 25,860.17 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం ఒక దశలో 7,952.55 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయినా చివరికి 67.80 పాయింట్ల నష్టంతో 7,965.50 పాయింట్ల వద్ద ముగిసింది.