బిజినెస్

హీరో సైకిల్స్ రికార్డు అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4: సైకిళ్ల తయారీ సంస్థ హీరో సైకిల్స్ గత నెల డిసెంబర్‌లో 6 లక్షలకుపైగా సైకిళ్లను అమ్మింది. 2014 డిసెంబర్‌తో పోల్చితే ఇది 20 శాతం అధికం. కాగా, కేవలం ఒక నెలలో ఈ స్థాయి అమ్మకాలు నమోదవడం భారతీయ సైకిళ్ల పరిశ్రమ చరిత్రలోనే ఇది తొలిసారి. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో హీరో సైకిల్స్ తెలిపింది. అమ్మకాల రికార్డుపై హీరో సైకిల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ ముంజల్ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో దాదాపు 3,000 కోట్ల రూపాయల టర్నోవర్‌ను నమోదు చేసిన హీరో సైకిల్స్.. ఏడాది కాలంలో 55 లక్షల సైకిళ్లను ఉత్పత్తి చేసింది. 2018 నాటికి ఈ టర్నోవర్ 8,000 కోట్ల రూపాయలకు చేరాలన్న లక్ష్యంతో హీరో సైకిల్స్ ముందుకెళ్తోంది.
రెనాల్ట్ విక్రయాల్లో రెండింతల వృద్ధి
న్యూఢిల్లీ, జనవరి 4: విదేశీ ఆటోరంగ సంస్థ రెనాల్ట్.. భారతీయ మార్కెట్‌లో గత నెల డిసెంబర్‌లో జరిపిన అమ్మకాలు ఏకంగా రెండింతలకుపైగా ఎగబాకాయి. 2014 డిసెంబర్‌లో 3,956 యూనిట్ల విక్రయాలు జరిగితే, 2015 డిసెంబర్‌లో 10,292 యూనిట్లకు పెరిగాయి. ఇక మొత్తం 2015లో రెనాల్ట్ సంస్థ 53,847 యూనిట్లను అమ్మింది. 2014లో 44,849 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఈ మేరకు రెనాల్ట్ ఇండియా సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

విప్రో సిఇఒగా అబిద్ అలీ నీముచ్‌వాలా
న్యూఢిల్లీ, జనవరి 4: దేశీయ ఐటి రంగ సంస్థల్లో మూడు అతిపెద్దదైన విప్రో.. సిఇఒగా అబిద్ అలీ నీముచ్‌వాలా పేరు ఖరారైంది. టికె కురియన్ స్థానంలో విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నీముచ్‌వాలా బాధ్యతలు చేపట్టనున్నారు. వచ్చే నెల ఈ కొత్త బాధ్యతలు ఆయన స్వీకరిస్తుండగా, కురియన్ విప్రో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా పదోన్నతి పొందారు. ఈ మేరకు సోమవారం విప్రో ఓ ప్రకటనలో తెలిపింది. కురియన్, నీముచ్‌వాలా సారథ్యంలో విప్రో విజయపథంలో నడవగలదన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జి వ్యక్తం చేశారు.

స్వల్పంగా తగ్గిన బజాజ్ ఆటో విక్రయాలు
న్యూఢిల్లీ, జనవరి 4: దేశీయ ఆటోరంగ సంస్థ బజాజ్ ఆటో గత నెల డిసెంబర్‌లో 2,89,003 వాహనాలను విక్రయించింది. అంతకుముందు డిసెంబర్‌లో 2,89,244 వాహనాలను అమ్మగా, ఈసారి స్వల్ప తగ్గుదలను చవిచూసింది. కాగా, మోటార్ సైకిళ్ల విక్రయాలు 2014 డిసెంబర్‌తో పోల్చితే 2015 డిసెంబర్‌లో 1 శాతం పెరిగి 2,46,233 యూనిట్ల నుంచి 2,47,782 యూనిట్లకు చేరాయి. ఇదే సమయంలో వాణిజ్య వాహన విక్రయాలు 4 శాతం పడిపోయి 43,011 యూనిట్ల నుంచి 41,221 యూనిట్లకు దిగజారాయి. ఎగుమతులు 12 శాతం పతనమై 1,66,134 యూనిట్ల నుంచి 1,45,477 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈ మేరకు సోమవారం సంస్థ ప్రకటించింది.