బిజినెస్

ఆర్‌బిఐ కొత్త డిప్యూటీ గవర్నర్‌గా విరల్ ఆచార్య నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కొత్త డిప్యూటీ గవర్నర్‌గా విరల్ వి ఆచార్య నియమితులయ్యారు. 42 ఏళ్ల ఈ న్యూయార్క్ యూనివర్శిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్.. మూడేళ్లపాటు ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌గా పనిచేయనున్నారు. ఈయనను బుధవారం కేంద్ర ప్రభుత్వం నియమించగా, కేంద్ర మంత్రివర్గంలోని నియామకాల కమిటీ ఆమోదించింది. ఆర్‌బిఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ పదవీకాలం ముగియడంతో డిప్యూటీ గవర్నర్‌గా ఉన్న ఉర్జిత్ పటేల్ ఆర్‌బిఐ గవర్నర్‌గా పదోన్నతి పొందినది తెలిసిందే. దీంతో ఖాళీ అయిన డిప్యూటీ గవర్నర్ పదవిని ఇప్పుడు ఆచార్యతో భర్తీ చేశారు. పాత పెద్ద నోట్ల రద్దుతో డిపాజిట్లు, ఉపసంహరణలతో సతమతమవుతున్న ఆర్‌బిఐలోకి ఆచార్య రాగా, మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను తరచూ ఈయన పొగుడుతూ ఉంటారు. తనకు రాజన్ ఆదర్శమని చెబుతారు. కాగా, ఆర్‌బిఐకి నలుగురు డిప్యూటీ గవర్నర్లుంటారు. ఆచార్య కాకుండా ప్రస్తుతమున్న డిప్యూటీ గవర్నర్లలో ఎస్‌ఎస్ ముంద్రా, ఎన్‌ఎస్ విశ్వనాథన్, ఆర్ గాంధీ ఉన్నారు.