బిజినెస్

పడిపోయిన పసిడి, వెండి ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: బంగారం, వెండి ధరలు శనివారం క్షీణించాయి. గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు.. ఈ ఏడాది చివరి రోజైన శనివారం మాత్రం తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర శుక్రవారం ముగింపుతో పోల్చితే 200 రూపాయలు పడిపోయి 28,300 రూపాయలకు చేరింది. 99.5 స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర కూడా 28,150 రూపాయల వద్ద నిలిచింది. కిలో వెండి ధర కూడా 500 రూపాయలు పతనమై 39,400 రూపాయల వద్ద స్థిరపడింది. ఆభరణాల వర్తకుల నుంచి ఆదరణ లేకపోవడంతోనే ధరలు పడిపోయాయని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, బంగారం, వెండి ధరలు ఈ ఏడాది పడుతూ.. లేస్తూ.. పయనించాయి. ఆరంభంలో 10 గ్రాములు 25,390 రూపాయలుగా ఉన్న 99.9 స్వచ్ఛత కలిగిన పుత్తడి.. ఇప్పుడు 28,300 రూపాయలుగా ఉంది. అలాగే కిలో వెండి ధర 33,300 రూపాయల నుంచి 39,400 రూపాయలకు చేరింది. దీంతో 10 గ్రాముల పసిడి ధర 2,910 రూపాయలు పెరిగితే, కిలో వెండి ధర 6,100 రూపాయలు పుంజుకున్నట్లైంది. రెండు లక్షల రూపాయలకు మించిన కొనుగోళ్లకు పాన్ కార్డు వినియోగం తప్పనిసరి చేయడం, జ్యుయెలర్ల సమ్మె, పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వంటివి ఈ ఏడాది బంగారం, వెండి అమ్మకాలను ప్రభావితం చేశాయి.