బిజినెస్

బిఎస్‌ఎన్‌ఎల్ అపరిమిత కాల్స్ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 31: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్.. తమ మొబైల్ వినియోగదారులకు కొత్త సంవత్సరం ఆఫర్‌ను ప్రకటించింది. అపరిమిత లోకల్, ఎస్‌టిడి కాల్స్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థలతో పోటీపడుతూ బిఎస్‌ఎన్‌ఎల్ కూడా సరికొత్త ఆఫర్లను పరిచయం చేస్తుండగా, ఇందులో భాగంగానే 144 రూపాయలకు ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏ నెట్‌వర్క్‌కైనా నెల రోజులు అపరిమితంగా లోకల్, ఎస్‌టిడి కాల్స్‌ను దీనిలో చేసుకోవచ్చు. 300 మెగాబైట్ల డేటా కూడా ఉచితంగానే వినియోగదారులకు లభిస్తుందని శనివారం ఇక్కడ బిఎస్‌ఎన్‌ఎల్ సిఎండి అనుపమ్ శ్రీవాత్సవ విలేఖరులకు తెలిపారు. ప్రీ-పెయిడ్, పోస్ట్-పెయిడ్ కస్టమర్లకు ఈ ప్లాన్ వర్తిస్తుందన్నారు. కాగా, దేశవ్యాప్తంగా 4,400 వైఫై హాట్‌స్పాట్లను ప్రారంభించనున్నట్లు ఆయన ఈ సందర్భంగా చెప్పారు.