బిజినెస్

భయం ఎక్కువ భరోసా తక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/హైదరాబాద్, డిసెంబర్ 31:అవును.. అచ్చం ఇలాగే ఉందిప్పుడు కొత్త 2,000 రూపాయల నోట్లున్నవారి సంగతి. పెద్ద నోటు కావడంతో ఎక్కువగా జేబులో పెట్టుకోలేని పరిస్థితి ఓవైపైతే, జేబులో ఉన్నా అవసరానికి వినియోగించుకోలేని దుస్థితి మరోవైపు. పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలోని మెజారిటీ ప్రజల స్థితి ఇప్పుడిదే మరి. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లను రద్దు చేసినది తెలిసిందే. 500, 1,000 రూపాయల నోట్ల చలామణిని రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రకటించారు. రద్దయిన నోట్లను బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసుకుని, వాటికి సమాన విలువైన కొత్త 500, 2వేల రూపాయల నోట్లను పొందవచ్చని చెప్పారు. అయితే 500 రూపాయల నోట్లు అందుబాటులోకి రాకపోవడం, 2వేల రూపాయల నోట్లు మాత్రమే రావడంతో చిల్లర కష్టాలు మొదలయ్యాయి. పాత 500, వెయ్యి రూపాయల నోట్లు రద్దు కావడం, కొత్త 500 రూపాయల నోట్లు లేకపోవడంతో చలామణిలో ఉన్న 100 రూపాయల నోట్లకు డిమాండ్ ఏర్పడింది. అవికాస్తా తక్కువగా ఉండటంతో 2వేల రూపాయల నోటు మార్పిడి పెద్ద తలనొప్పి వ్యవహారంగానే తయారైంది. ముఖ్యంగా దేశ జనాభాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న మధ్యతరగతి ప్రజల బాధలు వర్ణనాతీతం. వచ్చే అరకొర ఆదాయం 2వేల రూపాయల నోట్లలోనే ఉండటంతో ఖర్చులకు వాటిని విభజించుకోలేని నిస్సహాయతలో సగటు భారతీయుడు పడిపోయాడు. ఇంటి అద్దెలు, కిరణా సరకులు, విద్యుత్ బిల్లులు ఇలా అన్నింటికీ 2వేల రూపాయల నోటునే తీసుకెళ్లడం, చిల్లర కోసం నానా అగచాట్లు పడటం మామూలైపోయింది.
మనలో చాలామందికి గడచిన ఈ 50 రోజుల్లో ఎదురైన అనుభవాలే ఇవి. దీంతో జేబులో 2వేల రూపాయల నోటున్నా.. అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి సర్వత్రా నెలకొంది. ఫలితంగా ప్రతీ చిన్న అవసరాన్నీ వాయిదా వేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది. నగదు రహిత లావాదేవీలు అలవరచుకోవాలని కేంద్రం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నా.. వీధి చివరన ఉన్న చిరు వ్యాపారికి మాత్రం చిల్లరే కావాల్సి వచ్చింది. దీంతో చేతి నిండా డబ్బున్నా ఖర్చు పెట్టలేని వినియోగదారులతో రిటైల్ వ్యాపారం కుదేలైంది. ఒకవేళ ఎక్కడైనా క్రెడిట్, డెబిట్ కార్డులను వినియోగించినా సర్వీస్ ట్యాక్స్ మోత మోగుతోంది. దీంతో బ్యాంకు నుంచి పొందిన 2వేల రూపాయల నోటు ఇంట్లో బీరువాకో, జేబులకో పరిమితమవుతోందే తప్ప.. అవసరానికి మాత్రం పనికిరావడం లేదు. ఇక నగదు కొరతతో జేబు దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుండటంతో ఒకేసారి 2వేల రూపాయల నోటును కోల్పోవాల్సి వస్తోంది. పట్టణ, నగర వాసుల్లో ఈ బాధితులు ఇటీవలికాలంలో ఎక్కువగానే ఉంటున్నారు మరి.
వెంటనే కొత్త 500 రూపాయల నోట్లను చలామణిలోకి తీసుకురావడమో, లేక అదనంగా మరిన్ని వంద రూపాయల నోట్లను ముద్రించి మార్కెట్‌లోకి విడుదల చేయడమో చేస్తేగానీ 2వేల రూపాయల నోటు కష్టాలు తీరవు. ఇదే ఆర్థిక నిపుణుల మాట కూడా.