బిజినెస్

ఎస్‌ఎమ్‌ఇలకు డిజిటల్ సొబగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4: భారతీయ సూక్ష్మ, మధ్యతరహా సంస్థ (ఎస్‌ఎమ్‌ఇ)ల డిజిటలైజేషన్‌కు టెక్నాలజీ దిగ్గజం గూగుల్ నడుం బిగించింది. గూగుల్ ఆవిష్కరణలతో దేశంలోని 51 మిలియన్ల ఎస్‌ఎమ్‌ఇలకు డిజిటల్ సహకరం అందనుంది. గూగుల్ సిఇఒ, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్.. ఎస్‌ఎమ్‌ఇలు డిజిటల్ విధానంలోకి వెళ్లేందుకు కావాల్సిన అనేక నిర్ణయాలను బుధవారం ఇక్కడ ప్రకటించారు. ‘్భరత్ వంటి చోట సమస్యలను పరిష్కరిస్తే, ప్రపంచంలో ఎక్కడైనా సమస్యలను పరిష్కరించగలుగుతాం.’ అని ‘డిజిటల్ అన్‌లాక్డ్’ నైపుణ్య కార్య క్రమంలో పిచాయ్ మాట్లాడుతూ అన్నారు. గూగుల్ మరిం త ఉన్నత స్థానానికి చేరడానికీ ఇది దోహదపడుతుందన్న ఆయన అందరికీ ఉపయోగపడే పరిష్కారాలను చూపుతామని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థకు అసలుసిసలైన చోదక శక్తి సూక్ష్మ, మధ్యతరహా వ్యాపారాలేనన్న ఆయన సాంకేతిక పరిజ్ఞానం తోడైతే వ్యాపార, పారిశ్రామిక రంగాలు వృద్ధిపథంలో నడుస్తాయన్నారు. ఈ క్రమంలోనే సూక్ష్మ, మధ్యతరహా వ్యాపారాల (ఎస్‌ఎమ్‌బి)కు తగువిధంగా డిజిటలైజేషన్ శిక్షణ ఇవ్వడానికి గూగుల్ పెట్టుబడులు పెడుతుందని ప్రకటించారు. గూగుల్-కెపిఎమ్‌జి సంయుక్తంగా నిర్వహించిన ఓ పరిశోధనా అధ్యయనంలో భారత్‌లోని 51 మిలియన్ల ఎస్‌ఎమ్‌బిల్లో 8 మిలియన్లకుపైగా ఎస్‌ఎమ్‌బిలు గూగుల్‌ను వేదికగా చేసుకుని డిజిటల్ లావాదేవీలు జరుపుతున్నాయని తేలినట్లు చెప్పారు. ఇంటర్నెట్ వినియోగం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని, దీనివల్ల వ్యాపారం సులభతరమవుతుందన్నారు. అందరికీ అనువుగా ప్రాంతీయ భాషల్లోనూ గూగుల్‌ను పరిచయం చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హాజరయ్యారు. గురువారం తాను చదువుకు న్న ఐఐటి ఖరగ్‌పూర్‌ను పిచాయ్ సందర్శించనున్నారు.

బుధవారం న్యూఢిల్లీలో జరిగిన ‘డిజిటల్ అన్‌లాక్డ్’ నైపుణ్య కార్యక్రమంలో మాట్లాడుతున్న గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో పిచాయ్ కరచాలనం