బిజినెస్

రిజిస్ట్రేషన్స్ శాఖ ఆదాయానికి గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 4: పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల విభాగంపై స్పష్టంగా కనబడుతోంది. ఇళ్ల స్థలాల కొనుగోళ్లు, అమ్మకాలు మందకొడిగా జరుగుతుండటంతో లక్ష్యాల సాధనలో ఆ శాఖ వెనుకబడింది. పాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిరుడు నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. మొదటి నెల రోజుల్లోనే దాదాపు 8,00 కోట్ల రూపాయల మేరకు ఖజానాకు గండి పడింది. ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే ముఖ్య విభాగాల్లో ఒకటైన రిజిస్ట్రేషన్ల శాఖపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. నల్లధనం ప్రవహించే మార్గాల్లో రియల్ ఎస్టేట్ ఒకటి. అయతే నోట్ల రద్దు కారణంగా కొనుగోళ్లు దాదాపు నిలిచిపోవడంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఆంక్షల కారణంగా రిజిస్ట్రేషన్‌కు ఫీజు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయ. దీంతో చాలా వరకూ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. నిరుడు అక్టోబర్, నవంబర్ నెలల్లో 388.5 కోట్ల రూపాయల చొప్పున ఆదాయం లక్ష్యంగా చేసుకుంటే నోట్ల రద్దుతో అదికాస్తా.. వరుసగా 302.5, 229.5 కోట్ల రూపాయలకు పరిమితమైంది. డిసెంబర్ నెలలోనైతే 440.3 కోట్ల రూపాయల ఆదాయం వసూలు కావాలనుకుంటే, కేవలం 196.2 కోట్ల రూపాయలు మాత్రమే లభించింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 55 శాతం మేరకే లక్ష్యాలు సాధించే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఫీజును చెల్లించే విధానంలో కొన్ని మార్పులు చేసినప్పటికీ, ఆస్తుల వ్యవహారంపై కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు పడే వీలుందని పలువురు భూముల కొనుగోళ్లు, విక్రయాలకు దూరంగా ఉంటున్నారు.