బిజినెస్

పడుతూ.. లేస్తూ పయనం ( వారాంతపు సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, జనవరి 7: దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త సంవత్సరానికి నష్టాలతో స్వాగతం పలికాయి. పడుతూ.. లేస్తూ సాగిన ఈ ఏడాది తొలి వారంలో సూచీలు లాభాలను అందుకున్నప్పటికీ, విదేశీ మదుపరులు మాత్రం పెట్టు బడులకు దూరంగా ఉండటం మార్కెట్ వర్గాలకు కొంత నిరాశ కలిగించింది. ఇక గడచిన వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 132.77 పాయంట్లు పెరిగి 26,759.23 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 58 పాయంట్లు అందుకుని 8,243.80 వద్ద నిలిచింది. రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మెటల్, ఆటో, చమురు, గ్యాస్, క్యాపి టల్ గూడ్స్, ప్రభుత్వరంగ సంస్థలు, పవర్, హెల్త్‌కేర్, ఎఫ్‌ఎమ్‌సిజి, బ్యాంకింగ్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 14,123.73 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 84,147.90 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 11,869.82 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 77,385.17 కోట్ల రూపాయలుగా ఉంది.