బిజినెస్

మార్కెట్‌లోకి స్టీల్‌బర్డ్ సరికొత్త హెల్మెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 7: ప్రముఖ హెల్మెట్ తయారీ సంస్థ స్టీల్‌బర్డ్.. దేశీయ మార్కెట్‌లోకి 35 సరికొత్త హెల్మెట్లను తీసుకురానుంది. భారతీయ మార్కెట్‌లో మరింత పట్టు సాధించే దిశగా వెళ్తున్న స్టీల్‌బర్డ్.. గల్ఫ్, ఆఫ్రికా దేశాల్లోనూ విస్తరించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే నూతన ఉత్పత్తులపై స్టీల్‌బర్డ్ దృష్టి పెట్టింది. కాగా, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కొన్ని రకాల తమ బ్రాండ్లను భారతీయ మార్కెట్‌కు పరిచయం చేయాలనుకుంటోంది స్టీల్‌బర్డ్. వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) అందుకునే లైసెన్స్ ద్వారా వాటిని దేశీయ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనున్నట్లు స్టీల్‌బర్డ్ హై-టెక్ ఇండియా గ్లోబల్ గ్రూప్ అధిపతి (సేల్స్, మార్కెటింగ్) శైలేందద్ర జైన్ చెప్పారు. ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్రికా, యుఎఇ, శ్రీలంక తదితర దేశాలకు హెల్మెట్లు, యాక్ససరీస్‌ను స్టీల్‌బర్డ్ ఎగుమతి చేస్తోంది.

నత్తనడకన అవినీతి కేసులు

ఐదేళ్లుగా పెండింగ్‌లో 3,500 కేసులు: చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కెవి చౌదరి

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 7: దేశవ్యాప్తంగా అవినీతి కేసుల పరిష్కారంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోందని, నమోదైన కేసుల పరిష్కారానికి ఏళ్లకు ఏళ్లు పడుతోందని, ఇది మంచి విధానం కాదని కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కెవి చౌదరి అన్నారు. విశాఖ పోర్టు ట్రస్టు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా విశాఖలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 5 వేల అవినీతి కేసులు పెండింగ్‌లో ఉండగా, వీటిలో 3,500 కేసులు ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే సుమారు 300 అవినీతి కేసులు గత 20 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోలేదన్నారు. విజిలెన్స్ కమిషన్ దృష్టికి వచ్చిన కేసుల్లో తీవ్రతననుసరించి వాటిని సిబిఐ, ఆర్థిక నేరాల ప్రత్యేక దర్యాప్తు సంస్థలకు అప్పగిస్తామని తెలిపారు. ఏటా విజిలెన్స్ కమిషన్‌కు 8,000 కేసులు వస్తాయని, వీటిలో 2,000 నుంచి 3,000 కేసులు మాత్రమే దర్యాప్తునకు చేపట్టే యోగ్యత కలిగి ఉంటాయన్నారు. అవినీతి కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు, న్యాయశాఖను కోరినట్టు తెలిపారు. కాగా, విజిలెన్స్ కమిషన్ రెండేళ్ల కిందట ఒక సర్వే నిర్వహించగా ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయని, అధికారి లేదా సంస్థ అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు నమోదైన కేసు పరిష్కరించేందుకు 90 నెలల సమయం పడుతోందని, వాస్తవానికి ఇటువంటి కేసులు 18 నెలల్లోనే పరిష్కరించాల్సి ఉందన్నారు. అయతే ఇటీవల మరోసారి సర్వే నిర్వహించగా పరిస్థితి కొంత మెరుగుపడిందన్నారు. ప్రస్తుతం వీటి పరిష్కార సమయం 60 నెలలుగా తేలిందని చెప్పారు. అవినీతి జరిగిన తరువాత కేసులు నమోదు చేసే కంటే వాటిని ప్రారంభ దశలోనే నియంత్రించే విధంగా చట్టాలు మారాల్సి ఉందని సివిసి అభిప్రాయపడ్డారు. దీనికోసం చట్టంలో కొన్ని మార్పులకు ప్రతిపాదించాల్సి ఉందన్నారు.