బిజినెస్

పౌల్ట్రీకి చేయూతనివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 10: కోళ్ల పరిశ్రమకు బ్యాంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా చేయూతనివ్వాలని సెంట్రల్ పౌల్ట్రీ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (సిపిడిఒ) కోరింది. మంగళవారం ఇక్కడ ఎస్‌బిఐ గ్రామీణాభివృద్ధి శిక్షణ కేంద్రంలో కోళ్ల పరిశ్రమ-ఇబ్బందులు-సవాళ్లు అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సును ఎస్‌బిఐ చీఫ్ జనరల్ మేనేజర్ అశ్విన్ మెహతా ప్రారంభించారు. సిపిడిఒ ప్రతినిధి డాక్టర్ పిఎస్ మహేష్ మాట్లాడుతూ కోళ్ల పరిశ్రమకు సంబంధించి అనేక పథకాలను వివరించారు. పౌల్ట్రీ రంగాన్ని ఆదుకోవాలని, బ్యాంకర్లు తగినన్ని రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. బ్యాంకు చీఫ్ మేనేజర్ అశ్విన్ మెహతా మాట్లాడుతూ బ్యాంకులు చేస్తున్న ఆర్థిక రుణాల విధానాలను వివరించారు. బ్యాంకులకు, కోళ్ల పరిశ్రమకు మధ్య ఉన్న సంబంధాలపై ఎస్‌బిఐ గ్రామీణాభివృద్ధి ప్రిన్సిపాల్ ఎం జయశ్రీ రెడ్డి తెలిపారు. నిరుద్యోగులకు కోళ్ల పరిశ్రమల ఏర్పాటుపై విస్తృత స్ధాయిలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని చెప్పారు. ఈ సదస్సుకు కోళ్ల పెంపకందారులతోపాటు బ్యాంకు అధికారులు హాజరయ్యారు.

ఎస్‌బిఐ గ్రామీణాభివృద్ధి శిక్షణ కేంద్రంలో జరిగిన సదస్సులో పాల్గొన్న బ్యాంకర్లు, పౌల్ట్రీ రంగ నిపుణులు