బిజినెస్

దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఐదు ప్రభుత్వరంగ బీమా సంస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి మరిన్ని ప్రభుత్వరంగ బీమా సంస్థలు ప్రవేశిస్తున్నాయి. ఐదు ప్రభుత్వరంగ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలకు స్టాక్ మార్కెట్ల నుంచి నిధులను సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇక్కడ సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ విలేఖరులకు తెలిపారు. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలకు స్టాక్ మార్కెట్లలో ప్రవేశించేందుకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. దీంతో ఈ సంస్థల్లో ప్రభుత్వ వాటా 100 శాతం నుంచి 75 శాతానికి తగ్గుతుందని జైట్లీ చెప్పారు. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, బీమారంగ రెగ్యులేటర్ ఐఆర్‌డిఎఐ నిబంధనల ప్రకారం ఈ ఐదు సంస్థలు స్టాక్ మార్కెట్లలో లిస్టవుతాయని వివరించారు. కాగా, కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీమారంగ పరిశ్రమ స్వాగతించింది. పరిశ్రమ విశే్లషకులు సైతం ప్రశంసించారు. మరోవైపు ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి విధివిధానాల ఖరారుకు జైట్లీ నేతృత్వంలోని మంత్రుల బృందానికి కేంద్ర కేబినెట్ అధికారాలిచ్చింది.

బుధవారం న్యూఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతున్న జైట్లీ