బిజినెస్

ఆక్వా ఉత్పత్తులు పెంచడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జనవరి 25: ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఉద్దేశించిన ఆక్వా ఉత్పత్తులను పెంచాలనే లక్ష్యంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో అంతర్జాతీయ ఆక్వా సదస్సు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 11 నుంచి నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆక్వా ఎక్స్‌పోర్టర్ల సంఘం నాయకుడు, ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు విశ్వనాథరాజు బుధవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా సదస్సు బ్రోచర్లను ఆవిష్కరించారు.
‘మనం రొయ్యను కొన్ని దేశాలకు మాత్రమే ఎగుమతి చేస్తున్నాం. కానీ చైనా చేప యావత్తు ప్రపంచాన్ని శాసిస్తోంది’ అని విశ్వనాథరాజు ఈ సందర్భంగా అన్నారు. దేశం మొత్తం మీద కట్ల, రోహు, ఫంగస్ వంటి మూడు రకాల చేపలను మాత్రమే మనం పెంచుతున్నామని, చైనాలో 2 వేల రకాల చేపలను పెంచుతున్నారని తెలిపారు. దీంతో వివిధ దేశాలకు చైనా నుంచి చేపల ఎగుమతులు విపరీతంగా జరుగు తున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా కేవలం ఏటా 10 లక్షల టన్నుల చేపలను రైతాంగం పెంచుతుంటే, చైనాలో ఏడాదికి 62 లక్షల టన్నుల చేపలను ఉత్పత్తి చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక నుంచి ఎగుమతి రకాలను పెంచాలన్న ఉద్దేశంతో ‘ప్రాఫిట్ ఆన్ ఆక్వా కల్చర్’ పేరుతో అంతర్జాతీయ సదస్సును 5వ ఎడిషన్‌గా ఇక్కడ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలో వచ్చే నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని వివరించారు. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్, థాయ్‌లాండ్‌కు చెందిన ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆంధ్రప్రదేశ్ మత్య్సశాఖ, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. తొలిరోజైన 11వ తేదీ మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌సింగ్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు హాజరుకానున్నారు. 12న చైనీస్ డే నిర్వహిస్తారు. ప్రపంచాన్ని శాసిస్తున్న చైనా ఆక్వా రంగం గురించి ఇందులో విశే్లషణ ఉంటుంది. 14వ తేదీన వివిధ దేశాల నుంచి వచ్చిన శాస్తవ్రేత్తలు, విద్యార్థులు, వైస్ ఛాన్స్‌లర్లు తదితరులు ఇక్కడ సాగు పద్ధతులను స్వయంగా పరిశీలిస్తారు. షాంఘై ఓషన్ యూనివర్సిటీ, చైనా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రోబయోలజీ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైనె్సస్ నుంచి ప్రత్యేకంగా ఈ సదస్సుకు హాజరవుతారు.
భారత్‌తోపాటు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా, థాయ్‌లాండ్, తైవాన్, మలేషియా తదితర దేశాల ఆక్వా శాస్తవ్రేత్తలు పాల్గొంటారు. వనామి రొయ్య సాగు, హ్యాచరీలు, నీటి యాజమాన్యం, సేంద్రీయ పద్ధతి, వ్యాధులను అరికట్టడం తదితర అంశాలపై చర్చ జరుగుతుంది. కాగా, రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 300 మంది రైతులు ఈ సదస్సులో పాల్గొనే అవకాశం కల్పించారు. వీరిలో కొందరికి ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ అవార్డులు ప్రకటిస్తుంది. త్వరలోనే యానాంలో ఆస్ట్రేలియా సహకారంతో పండుగప్ప హ్యాచరీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో భీమవరంలో కొరమేను హ్యాచరీలను ఏర్పాటు చేసుకోబోతున్నామని విశ్వనాథరాజు తెలియజేశారు.