బిజినెస్

కొబ్బరి రైతుకు దన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 8: తూర్పు గోదావరి జిల్లాలో మరో రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో ఒకటి కొబ్బరి పార్కు, మరొకటి కొబ్బరి పరిశోధనా కేంద్రం. వీటి ఏర్పాటుకు అనువైన స్థలాలను అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఐపిసిఆర్‌ఐ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ రిసెర్చి) డైరెక్టర్ చౌడప్ప ఈ స్థలాలను పరిశీలించి కూడా వెళ్లారు. తూర్పు కేరళగా భాసిల్లుతున్న కోనసీమలో కొబ్బరి సాగు అధికం. అందుకే ఇక్కడి కొబ్బరి రైతులకు దన్నుగా నిలవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటున్నాయ. అమలాపురం రూరల్ మండలంలో కొబ్బరి పార్కు కోసం స్థలాన్ని సైతం ఎంపికైంది. దీనికి కేంద్ర ఉన్నతాధికారుల ఆమోదమే తరువాయి. కొబ్బరితో అనేక ఉప ఉత్పత్తులను పారిశ్రామిక స్థాయిలలో తయారు చేసేందుకు వీలుగా కొబ్బరి పార్కును ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కేరళలో ఇటువంటి పరిశ్రమల ద్వారా ఎంతో మందికి ఉపాధి లభిస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే కోనసీమ ప్రాంత కొబ్బరికి పారిశ్రామిక విలువలు మరింతగా పెరిగే అవకాశాలునున్నాయి. కొబ్బరి పార్కు వల్ల ఇటు రైతులకూ లాభసాటి ధర లభించనుంది. కోకోనట్ మిల్క్ పౌడర్, కోకోనట్ ఐస్ క్రీమ్, కోకోనట్ చాక్‌లెట్, కోకో షుగర్ వంటి ఎన్నో ఉత్పత్తుల పరిశ్రమలు వస్తాయి. కొబ్బరి ఆధారిత అనేక హెల్త్ ప్రోడక్టులు, విలువ ఆధారిత ఉత్పత్తులు తయారవుతాయ. కేంప్‌కో మిల్క్ బార్, కొబ్బరి చాక్‌లెట్‌లను ఇప్పటికే బహుళ జాతి సంస్థలు తయారు చేస్తున్నాయి. ఈ పార్కులో ఇటువంటి పరిశ్రమలన్నీ రానున్నాయి. కొబ్బరి నీరా ప్రధానంగా ఉత్పత్తి చేయనున్నారు. నీరా తయారీకి ఆబ్కారీ చట్టాన్ని సవరించాల్సి ఉంది. ఎపి ప్రభుత్వం ఇందుకు అవసరమైన సవరణలు చేసిన అనంతరం ఈ పార్కులో నీరా తయారీ కేంద్రం నెలకొల్పడానికి ఏర్పాట్లు జరగనున్నాయ. నీరా ద్వారా షుగర్ కూడా తయారు చేయనున్నారు. ఇది మధుమేహ వ్యాధి నిరోధక ఔషధంగా కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కాగా, నీరా తయారీ వల్ల రైతులకు ఇతోధికంగా ఆదాయం పెరుగుతుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వరంగ కొబ్బరి ప్లాంటు పరిశోధనా సంస్థ కడియం మండలం మాధవరాయుడుపాలెంలో ఏర్పాటవుతోంది. ఇందు కోసం 50 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ కేంద్రం ద్వారా కొబ్బరి అభివృద్ధి, విస్తరణ, కొత్త రకాల తయారీ వంటి ఎన్నో ప్రయోజనాలు రైతులకు దక్కనున్నాయి. కొబ్బరి కొత్త రకాలతోపాటు అంతర పంటగా వేసే కోకో క్రోనల్ సీడ్ కూడా తయారుచేసి రైతులకు పంపిణీ చేస్తారు. తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే కొత్త రకాలను రైతులకు అందిస్తారు. ఎత్తయన కొబ్బరి రకాలు కాకుండా దాదాపు చెయ్యి ఎత్తితే గెలలు అందే పొట్టి కొబ్బరి మొక్కలు రైతులకు అందించనున్నారు. దీనికితోడు కొబ్బరి మార్కెటింగ్ వ్యవహారాలు కూడా ఈ కేంద్రం చూస్తుంది. రైతులకు లాభసాటి ధరలు ఉండే విధంగా ఎప్పటికప్పుడు నియంత్రణ చర్యలు తీసుకుంటుంది. మొత్తం మీద కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉన్న సిఐసిఆర్ ఆధ్వర్యంలోని ఐపిఎఆర్‌కు చెందిన ఈ రెండు సంస్థల ఏర్పాటు తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో కొబ్బరి రంగం దశ మారుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.