బిజినెస్

శ్రీసిటిలో త్వరలో ఇఎస్‌ఐ ఆసుపత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ/సత్యవేడు, ఫిబ్రవరి 8: నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లో నెలకొల్పిన శ్రీసిటి పారిశ్రామిక వాడను బుధవారం ఇఎస్‌ఐ కార్పొరేషన్ స్టేట్ మెడికల్ కమిషనర్ డాక్టర్ ఇమ్మానియల్ సందర్శించారు. శ్రీసిటి పరిసరాల్లో ఇఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రదేశాన్ని చూసేందుకు ఇక్కడకు వచ్చారు. శ్రీసిటి వైస్‌ప్రెసిడెంట్ పి రమేష్‌కుమార్ ఆయనకు సాదర స్వాగతం పలికారు.
శ్రీసిటి పారిశ్రామికవాడలో దాదాపు 20 వేల మంది వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్నట్లు కమిషనర్‌కు తెలియజేశారు. ఇక్కడ కార్మికులకు ఇఎస్‌ఐ ఆసుపత్రి ఆవశ్యకత గురించి వివరించారు. వీలయినంత త్వరలో ఈ ప్రాంతంలో ఇఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు చేపడతామని కమిషనర్ హామీ ఇచ్చారు.
కాగా, మొట్టమొదటగా 30 పడకల ఆసుపత్రిగా ప్రారంభించి అంచలంచెలుగా అభివృద్ధి పరుస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన స్థల పరిశీలన చేస్తున్నామని తాత్కాలిక ఏర్పాటుగా ఇప్పటికే వరదయ్యపాళెం, సత్యవేడు ప్రాంతాల్లో ప్యానల్ డాక్టర్లను నియమించామన్నారు. కమిషనర్‌తోపాటు ఇఎస్‌ఐ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్ విచ్చేశారు.