బిజినెస్

అభివృద్ధి బాటలో విజయ డెయిరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: దేశంలోనే తెలంగాణ విజయ డెయిరీ పాలు, పాలపదార్థాలను ప్రైవేట్ సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర పశుగణాభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. తెలంగాణ విజయ డెయిరీ క్యాలెండర్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేట్ డెయిరీలను విజయ డెయిరీ మించి పోయిందని, ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఎక్కువగా వాడుకుంటున్నామన్నారు. విజయ డెయిరీ ఉత్పత్తి చేసిన విజయ లస్సీ, మ్యాంగో, స్ట్రాబెర్రీ, బాదం ఫ్లేవర్‌లను మంత్రి ఈ సందర్భంగా విడుదల చేశారు. విజయ డెయిరీకి మంచి ప్రజాదరణ ఉందని, ఇప్పటికే ప్రారంభించిన ఉత్పత్తులు కాకుండా మరికొన్ని ఉత్పత్తులను కూడా ప్రారంభించబోతున్నామన్నారు. గతంలో రోజూ 80 వేల లీటర్లపాల సేకరణ జరిగేదని, ఇప్పుడు 4.50 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నామన్నారు. లీటర్ పాలకు ఒక్కో రైతుకు నాలుగు రూపాయలు ప్రోత్సాహకంగా ఇస్తున్నామని, ఇందుకోసం ఏటా 72 కోట్ల రూపాయలు ఖర్చవుతాయన్నారు.
ప్రపంచ శ్రేణి ఫార్మాసిటీ లక్ష్యం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 8: ప్రపంచ స్థాయి ఫార్మాసిటీ హైదరాబాద్‌లో నిర్మాణం జరుగుతోందని, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. టిఎస్‌ఐఐసి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఐఎఫ్) ప్రతినిధి బృందం ఉత్తరాఖండ్‌లోని ఫార్మా, ఇతర పారిశ్రామిక వాడలను సందర్శించింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం అందిస్తున్న పారిశ్రామిక రాయితీలు, సబ్సిడీలు, ఇతర అభివృద్ధి చర్యలను పరిశీలించినట్లు తెలిపింది. ఈ సందర్భంగా అక్కడి పారిశ్రామిక శాఖ సమావేశంలో తెలంగాణ ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని కోరింది.