బిజినెస్

45 పాయింట్లు కోల్పోయిన సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 8: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉండటంతో మదుపరులు లాభాల స్వీకరణ వైపు నడిచారు. అంచనాలకు విరుద్ధంగా రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్ల జోలికి ఆర్‌బిఐ వెళ్లకపోవడంతో ప్రధానంగా బ్యాంకింగ్, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 45.24 పాయింట్లు కోల్పోయి 28,289.92 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ మాత్రం అతి స్వల్పంగా 0.75 పాయింట్లు పెరిగి 8,769.05 వద్ద నిలిచింది. అంతర్జాతీయంగా చూస్తే ఆసియా మార్కెట్లలో కీలకమైన జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ప్రధాన ఐరోపా మార్కెట్లు కూడా లాభాల్లోనే కదలాడాయి.