బిజినెస్

ఖాదీ ఉత్పత్తులకు డిమాండ్: కెవిఐసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: గడచిన ఆరు నెలల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌రంగాల నుంచి కోట్లాది రూపాయల ఆర్డర్లు అందుకున్నట్లు ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల సంఘం (కెవిఐసి) శనివారం తెలియజేసింది. ఇందులో 23 కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రులు కూడా ఉన్నాయని, వాటికి 150 కోట్ల రూపాయల ఖాదీ ఉత్పత్తులను సరఫరా చేశామని చెప్పింది. అలాగే ఒఎన్‌జిసి (రూ. 52 కోట్లు), రైల్వేలు (రూ. 42 కోట్లు), ఎయిరిండియా (రూ. 11 కోట్లు), ఎన్‌టిపిసి (రూ. 5 కోట్లు), జెకె వైట్ సిమెంట్ (రూ. 17 లక్షలు) సంస్థలకు ఖాదీ ఉత్పత్తులను అందించామని ఓ ప్రకటనలో కెవిఐసి చైర్మన్ వికె సక్సేనా తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు వచ్చిన దగ్గర్నుంచి ఖాదీ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందన్నారు.