బిజినెస్

ఖాతాదారులందరికి మొబైల్ బ్యాంకింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 1: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం.. అన్ని బ్యాంకులను ఈ నెల 31లోగా ఖాతాదారులందరికీ మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది. ‘మొబైల్ ఫోన్లున్న ఖాతాదారులందరికీ మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని కల్పించేలా బ్యాంకులు దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలి. మార్చి 31 వరకు ప్రచారం నిర్వహించాలని మేము బ్యాంకులను కోరాం.’ అని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి కార్యదర్శి అరుణ సుందరరాజన్ బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. డిజిటల్ పేమెంట్ వ్యవస్థకు ఊతమిచ్చేందుకే ఈ నిర్ణయమని ఆమె చెప్పారు. కాగా, యుపిఐ లేదా భీమ్ యాప్ ఆటోమెటిక్‌గా మొబైల్ బ్యాంకింగ్‌కు అనుసంధానం చేశామన్నారు. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం పాత 500, 1,000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం నిరుడు నవంబర్ 8న రద్దు చేసినది తెలిసిందే. వీటి స్థానంలో కొత్త 500, 2,000 రూపాయల నోట్లను తీసుకొచ్చిన కేంద్రం.. రద్దయిన నోట్లను బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసుకుని వాటికి సమాన విలువైన కొత్త నోట్లను తిరిగి పొందవచ్చని కూడా చెప్పింది. అయితే డిమాండ్‌కు తగ్గ నోట్ల సరఫరా లేకపోవడంతో డిజిటల్ పేమెంట్లపై దృష్టి సారించింది కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు. ఈ దిశగా ఇప్పటికే డిజి ధన్ వ్యాపార్ యోజ న, లక్కీ గ్రాహక్ యోజనలనూ ప్రవేశపెట్టింది. వీటి ద్వారా నగదు బహుమతులను వినియోగదారులకు, వ్యాపారులకు అందిస్తోంది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొనుగోళ్లకూ క్రెడిట్, డెబిట్ కార్డులను వినియోగించేలా చర్యలు చేపడుతోంది. 3 లక్షల రూపాయలకు మించి జరిగే లావాదేవీలు నగదు రహితంగానే ఉండాలన్న ఆదేశాలనూ జారీ చేసింది. మొత్తంగా నగదు రహిత ఆర్థిక వ్యవస్థ కల సాకరమయ్యేలా మోదీ సర్కారు వీలైనంతగా ప్రయత్నిస్తోంది.