బిజినెస్

మామూలు టీవీని స్మార్ట్ టీవీగా మార్చే టెక్నాలజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: క్లౌడ్ వాకర్ స్ట్రీమింగ్ టెక్నాలజీస్.. డిజిటల్ ఎకో వ్యవస్థ ద్వారా లార్జ్ ఫార్మెట్ స్క్రీన్‌లను, ఇదివరకే ఉన్న మామూలు టీవీలను స్మార్ట్ టీవీలుగా మార్చే సౌకర్యాన్ని పరిచయం చేసింది. తాము అభివృద్ధి చేసిన ఈ క్లౌడ్ టీవీ ద్వారా స్మార్ట్ టీవీ అనుభూతి కలుగుతుందని క్లౌడ్ వాకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. క్లౌడ్ వాకర్ తమ సొంత యూజర్ ఇంటర్ఫేస్ అయిన కంటెంట్ డిస్కవరీ ఇంజిన్ (సిడిఇ) ద్వారా ఇంటర్నెట్‌లో ఉండే ఉచిత, ప్రీమియం, ప్రీమియం ఆధారిత డిజిటల్ కంటెంట్‌తోపాటు యాప్‌లను వెతికి స్మార్ట్ టీవీపై వీక్షించవచ్చని తెలిపింది. ఇంకా స్క్రీన్ షిఫ్ట్ విధానంతో లైవ్ టీవీని డిజిటల్ టీవీగా అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చని కూడా వివరించింది. కర్వ్డ్ ఫ్లాట్ 4కె యుహెచ్‌డి, ఫుల్ హెచ్‌డి టీవీలు ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పని చేస్తాయని స్పష్టం చేసింది.