బిజినెస్

ఆటుపోట్లకు ఆస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 5: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 9న (గురువారం) వచ్చే ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు కూడా సూచీలను ప్రభావితం చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయతే సోమవారం అమెరికా రిజర్వ్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జనెట్ యెల్లెన్ ప్రసంగం భారతీయ మార్కెట్లపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. వడ్డీరేట్లను ఫెడరల్ రిజర్వ్ పెంచే వీలుందన్న అంచనాలున్నది తెలిసిందే. దీంతో సోమవారం యెల్లెన్ ప్రసంగంలో దానిపై దాదాపు స్పష్టత వచ్చే వీలుండటంతో మదుపరులు చాలా ఆసక్తితో గమనిస్తున్నారు. కాగా, 11న (శనివారం) ఎన్నికల ఫలితాలు రానుండగా, 13న (సోమవారం) హోళి సందర్భంగా మార్కెట్లకు సెలవు. 14న (మంగళవారం) తిరిగి స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ మొదలవనుండగా, అదేరోజు ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యసమీక్ష కూడా ఉండనుంది. ఇందులో వడ్డీరేట్లపై నిర్ణయం రానుంది. దీంతో అటు ఉత్తరప్రదేశ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై, ఇటు ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యసమీక్షపై మంగళవారం మదుపరులు స్పందిస్తారని మెజారిటీ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ వారం మొత్తం మార్కెట్లను అంచనాలే నడిపిస్తాయని, ఈ క్రమంలో ఆటుపోట్లకు ఆస్కారం ఉందని అంటున్నారు. కాగా, ముంబయ మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి దక్కిన ఘన విజయం నేపథ్యంలో యుపిలో కూడా బిజెపికి స్పష్టమైన మెజారిటీ వస్తే మార్కెట్లు లాభాల్లో పరుగులు పెట్టగలవన్న అభిప్రాయాన్ని కొటక్ సెక్యూరిటీస్ పిసిజి రిసెర్చ్ సీనియర్ ఉపాధ్యక్షుడు దీపెన్ షా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలూ మదుపరుల పెట్టుబడులపై ప్రభావం చూపుతాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయ. ప్రధానంగా విదేశీ వ్యాపారంపైనే ఆధారపడ్డ భారతీయ ఐటి సంస్థలను అమెరికా హెచ్-1బి వీసాల వ్యవహారం ఆందోళనకు గురిచేస్తోంది. వీసాల జారీ అంశానికి సంబంధించి అమెరికా సర్కారు కొత్త మార్పులకు ప్రతిపాదిస్తుండటమే కారణం. కాగా, ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల కదలికలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 60.52 పాయింట్ల్లు పడిపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 41.95 పాయింట్లు దిగజారింది. ఫలితంగా వరుసగా నాలుగు వారాలు లాభాల్లో నడిచిన సూచీల జోరుకు బ్రేక్ పడినట్లైంది.
లింగ సమానత్వానికి మద్దతుగా..
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లన్నీ ఈ వారం తమ రింగింగ్ బెల్ కార్యక్రమాలను లింగ సమానత్వానికి అంకితం చేస్తున్నాయ. ఈ క్రమంలో సోమవారం నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) స్పెషల్ క్లోజింగ్ బెల్ కార్యక్రమంతో లింగ సమానత్వానికి జై కొట్టనుండగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ) 8న (బుధవారం) ఈ తరహా రింగింగ్ బెల్ కార్యక్రమంతో తమ మద్దతును తెలియపరచనుంది.