బిజినెస్

సౌర, పవన విద్యుత్‌తో విస్తృత అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: సౌర, పవన విద్యుత్ ద్వారా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని సాధించడం సాధ్యమవుతుందని తెలంగాణ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ జస్టిస్ బి చంద్రకుమార్ అన్నారు. పర్యావరణ పరిరక్షణకు సౌర, పవన విద్యుత్‌ను వినియోగించుకుని దూరదృష్టితో తెలంగాణను అభివృద్ధి చేసుకునేందుకు వీలవుతుందని ఆయన సూచించారు.
బుధవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులు, వ్యవసాయం, బొగ్గు, అభివృద్ధి తదితర అంశాలపై ప్రస్తావించారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల పంటల విధానంపై తీవ్ర ప్రభావం పడుతోందని అన్నారు.
అంతేకాకుండా ప్రజలు సీజనల్ రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం దామచర్ల ఎన్‌టిపిసి వద్ద ఓపెన్‌కాస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తోందని చెబుతూ అభివృద్ధి అంటే కేవలం కార్పొరేట్ రంగం అభివృద్ధే కాదని అన్నారు. జాతి, రాష్ట్రం, ప్రజలకు మేలు జరిగే విధంగా ఉండాలని సూచించారు. పర్యావరణ సమతుల్యత అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాస్తవ్రేత్తల నుంచి తగిన సలహాలు సూచనలు తీసుకోవాలని చంద్రకుమార్ ఈ సందర్భంగా కోరారు.
సింగపూర్ తరహా అభివృద్ధిని ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు కోరుకోవడాన్ని ఆయన విమర్శించారు. అతి తక్కువ ఖర్చుతో పర్యావరణ సమతుల్యతను రక్షించే విధంగా సౌర, పవన విద్యుత్‌లను వినియోగించుకోవాలని చంద్రకుమార్ ఎపి, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించారు.