బిజినెస్

కార్పొరేట్ పన్ను కోతలకు స్పష్టమైన ప్రణాళిక అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: రాబోయే బడ్జెట్‌లో కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించే అంశంలో స్పష్టమైన ప్రణాళిక ఉండాలని దేశీయ పారిశ్రామిక రంగం ప్రభుత్వాన్ని కోరింది. బుధవారం పారిశ్రామిక సంఘాలైన సిఐఐ, ఫిక్కీ అధిపతులు.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో ముందస్తు బడ్జెట్ సంప్రదింపుల సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేట్ రంగానికి మేలు జరిగేలా నిర్ణయాలుండాలని సిఐఐ అధ్యక్షుడు సుమిత్ మజుందార్, ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ నియోటియా జైట్లీని కోరారు. సమావేశంలో నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.