బిజినెస్

తెలంగాణలో పది హెలిపోర్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: తెలంగాణ వ్యాప్తంగా పది చోట్ల హెలిపోర్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ఇటీవల ఆ ప్రతిపాదనలు సమర్పించింది. వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలోని బసంత్‌నగర్, దుండిగల్, హకీంపేట, హైదరాబాద్‌లోని నాదర్‌గుల్, నాగార్జునసాగర్, నల్గొండ, ఆలేరు, కాగజ్‌నగర్ (సిర్పూర్)లో హెలిపోర్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు అందజేసింది. దీంతోపాటు ప్రాంతీయ అనుసంధాన పథకం (ఆర్‌సిఎస్) కింద హరితక్షేత్ర విమానాశ్రయాలను నెలకొల్పేందుకు పరిశీలనలోకి తీసుకోవాలని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాలోని జక్రన్‌పల్లి వద్ద హరితక్షేత్ర విమానాశ్రయాలను నెలకొల్పే ప్రతిపాదన ఉన్నట్లు తెలిపింది. వీటికితోడు హైదరాబాద్ ఫార్మాసిటీ, మెదక్‌లోని ఎన్‌ఐఎంజె సిటీ ప్రాంతాలను కూడా ఆర్‌సిఎస్ జాబితాలో చేర్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. విమానయాన అభివృద్ధిని రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టేందుకు వీలుగా ఈ ఏడాది జనవరి 12న కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎయిర్ ఇండియా అథారిటీ (ఎఎఐ)తో ఆర్‌సిఎస్-ఉడాన్‌పై తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. గతంలో వరంగల్లు ఎయిర్‌పోర్టును నిర్వహణలో లేని ఎయిర్‌పోర్టుగా భారత విమానశ్రయాల ప్రాధికార సంస్థ తెలియజేసింది. అయతే దీన్ని అభివృద్ధి చేసేందుకు ఇటీవల ఎఎఐ అంగీకరించింది. కానీ ప్రస్తుతం ఉన్న వరంగల్లు ఎయిర్‌పోర్టు భూమి 748.02 ఎకరాలకు అదనంగా 438 ఎకరాలను సమకూర్చాలని ఎఎఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరింది. ఈ భూముని అప్పగించిన అనంతరం ఎఎఐ వరంగల్లు ఎయిర్‌పోర్టు పనులను చేపట్టేందుకు మార్గం సుగమమవుతుంది.
రూ. 13 కోట్ల నిధులు మంజూరు
కాగా, ఏవియేషన్ కార్పొరేషన్‌కు ఫ్లయింగ్ అవసరాలను తీర్చడం కోసం లీజుపై ప్రైవేటు ఏజెన్సీల నుంచి హెలికాప్టర్లను తీసుకునేందుకు వీలుగా 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను 13 కోట్ల రూపాయల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఏవియేషన్ కార్పొరేషన్ వద్ద ఎండి బెల్-430, ఎడబ్ల్యూ 139 హెలికాప్టర్లు ఉండేవి. అయతే దురదృష్టవశాత్తు బెల్-430 హెలికాప్టర్‌ను క్రాష్‌లోనూ, ఎడబ్ల్యూ 139 హెలికాప్టర్‌ను పాత ఎయిర్‌పోర్టులో జరిగిన అగ్నిప్రమాదంలో కోల్పోవడం జరిగింది. దీంతో అప్పటి నుంచి ఫ్లయింగ్ అవసరాలకు ప్రైవేటు ఏజెన్సీల నుంచి హెలికాప్టర్లను ఏవియేషన్ కార్పొరేషన్ లీజుకు తీసుకుంటోంది.