బిజినెస్

ఇక ధరలన్నీ దిగివస్తాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందన్న ఆశాభావాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు. జిఎస్‌టి అమలుతో ఆయా వస్తువుల ధరలు తగ్గి చౌకవుతాయన్న ఆయన పన్ను ఎగవేతదారులకు కళ్లెం వేసినట్లు కూడా అవుతుందని అన్నారు. బుధవారం ఇక్కడ 23వ కామనె్వల్త్ ఆడిటర్ జనరల్ సదస్సులో పాల్గొన్న జైట్లీ మాట్లాడుతూ దేశంలో పన్ను ఎగవేతదారులు పెద్ద ఎత్తున ఉన్నారని, వారికి అడ్డుకట్ట వేయడానికి పాత పెద్ద నోట్ల రద్దు దోహదపడిందన్నారు. పాత పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం వెలికితీత, నకిలీ కరెన్సీల నిర్మూలన కూడా జరుగుతోందని చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలతో దేశ జిడిపి వృద్ధిరేటు 7-8 శాతానికి చేరుకుంటోందని చెప్పారు.

30 నుంచి దక్షిణాది రాష్ట్రాల
లారీల నిరవధిక బంద్

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మార్చి 22: అపరిష్కృత డిమాండ్ల సాధన కోసం ఈ నెల 30వ తేదీ నుంచి సౌత్‌జోన్ మోటార్ ట్రాన్స్‌పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో లారీల నిరవధిక బంద్‌ను చేపట్టబోతున్నామని ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘ ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు తెలిపారు.
బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం రవాణా వాహనాల థర్డ్ పార్టీ ప్రీమియం 50 శాతం పెంచిందని, దీనివల్ల 6 టైర్ల లారీకి 33,865 రూపాయలు, 10 టైర్ల లారీకి 37,062 రూపాయలు ట్రైయిలర్‌లకు 38,700 రూపాయలతోపాటు అదనంగా సర్వీస్ టాక్స్ చెల్లించాల్సి వస్తున్నదన్నారు. టోల్‌టాక్స్ ఎత్తివేయాలని, పెంచిన చలానా ఫీజులను సవరించాలని, జరిమానాలను రద్దు చేయాలని, 15 ఏళ్ళు దాటిన వాహనాల స్క్రాప్ ఆలోచనను విరమించాలని డిమాండ్ చేశారు.
ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరిగా ఎసి క్యాబిన్ ట్రక్కుల సరఫరా ఆదేశాలను ఉపసంహరించాలని, డీజిల్‌పై పెంచిన 4 రూపాయల వ్యాట్‌ను రద్దు చేయాలని, ఆంధ్ర, తెలంగాణలకు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు జారీ చేయాలని కోరారు.